Tomato Prices Down: గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన టమాటా ధరలు.. కిలో ఎంతంటే..
వంటింటి నిత్యావసరం టమాటా మళ్లీ మొరాయించడం మొదలు పెట్టింది. టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. భారీగా టమాటా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులకు కొన్నిచోట్ల.. వర్షపాతం ఎక్కువైన సందర్భాల్లో కొన్నిచోట్ల టమాటా దిగుమతి తగ్గిపోతోంది.
వంటింటి నిత్యావసరం టమాటా మళ్లీ మొరాయించడం మొదలు పెట్టింది. టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. భారీగా టమాటా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులకు కొన్నిచోట్ల.. వర్షపాతం ఎక్కువైన సందర్భాల్లో కొన్నిచోట్ల టమాటా దిగుమతి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతా కూడా టమాటా ధరలు ఎక్కువ అవుతున్నాయి. టమాటా ధరలకి అధికారులు.. అలాగే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. కొత్తగా టమాటాకు సబ్సిడీ ఇద్దామనే ఆలోచన, జీవో తీసుకుని రావడంతో వినియోగదారులకి ఊరట లభిస్తోంది. టమాటా ధరలు బహిరంగ మార్కెట్లో బాగా మండిపోతున్నాయి. కిలో 75 నుంచి 100 రూపాయల బహిరంగ మార్కెట్లో ధరలు అమలవుతున్నాయి. మొన్నటి వరకు రైతు బజార్లలో కూడా 64 రూపాయల నుంచి 73 రూపాయలు వరకూ విక్రయాలు చేశారు. వారం క్రితం వరకు 73 రూపాయిల వరకు టమాటా అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం మార్కెట్ లో టమోటాలు కొనాలంటేనే సామాన్యుడు బెంబేలెత్తే పరిస్థితి వచ్చింది.
టమాటాలు ఇప్పుడే కాదు. గతంలో కూడా చాలా ఇబ్బందికరమైన పంటగా మారుతోంది. దాదాపు ఏడాదిలో 4, 5 సార్లు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలకి ఎక్కువగా వాతావరణ పరిస్థితులే కారణమని ఎంవిపి రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రసాద్ తెలిపారు. విశాఖపట్నం జిల్లాకు మదనపల్లి నుంచి.. ఇతర మార్కెట్ ల నుంచి టమాట దిగుమతి అవుతుంటాయన్నారు. ఎక్కువగా మదనపల్లి నుంచే విశాఖకు సరఫరా అవుతుంటాయని, ధరలతో పోలిస్తే విశాఖపట్నం రైతు బజార్లలో ఇప్పటికీ తక్కువ ధరకే టమాటోలు అమ్ముతున్నామన్నారు. ప్రస్తుతం ఎంవిపి రైతు బజార్లో మూడు కౌంటర్లు పెట్టి వినియోగదారులకు విక్రయాలు చేస్తున్నామని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువగా రష్ ఉంటుందని.. భారీ క్యూ లైన్లు ఉన్నాయని. అయినప్పటికీ ఎప్పటికప్పుడు టమాటా విక్రయాలు జోరుగా సాగిస్తున్నామని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించారు.