ఎల్బీనగర్:
ప్రతిష్టాత్మక మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ – బిర్లా ప్లానిటోరియం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో సమాజంలో వివిధ రంగాలలో సేవలు అందించిన రెండు రాష్ట్రాల ప్రముఖులకు అవార్డులు అందచేశారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ – ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహ అధ్యక్షులు మార్గం రాజేష్ కు “కీర్తి టాలెంట్ ఐకాన్ అవార్డు”ను అందచేశారు. ఈ సందర్భంగా మెగా హెల్పింగ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శిరీష రెడ్డి మాట్లాడుతూ, అనాథ విద్యార్థులను అక్కున చేర్చుకొని,వారికి అమ్మలా- నాన్నలా అన్ని తానై, ఉచిత భోజన, వసతి, ఆన్ని విద్యా సౌకర్యాలు కల్పించి వారికి ప్రైవేట్ పాఠశాలలలో , కళాశాలల్లో ఉచిత ప్రవేశాలు కల్పించి,బంగారు భవిష్యత్తుకు అహర్నిశలు కృషి చేస్తున్న అనాథ విద్యార్థి గృహ అధ్యక్షులు మార్గం రాజేష్ ను కీర్తి ఐకాన్ అవార్డుకు ఎంపిక చేశామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సినీ నటుడు గౌతం రాజు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రిటైర్డ్) రత్న , తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ వేణు, నేషనల్ కబడ్డీ ప్లేయర్ జ్యోష్ణ హాజరైనారు.


