Home తెలంగాణ అమరులైన అగ్నివీర్ సైనికులకు శ్రద్ధాంజలి..

అమరులైన అగ్నివీర్ సైనికులకు శ్రద్ధాంజలి..

0
107
Justice Chandrakumar expressed his deepest condolences to their families.
Justice Chandrakumar expressed his deepest condolences to their families.

వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జస్టిస్ చంద్రకుమార్..

పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో అమరులైన అగ్నివీర్ సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు శాంతి చర్చల కమిటీ సభ్యులు.. అదే విధంగా వారి కుటుంబాలకు మరియు ఇటీవల కర్రేగుట్ట ప్రాంతంలో మరణించిన గ్రేహౌండ్ దళాలకు చెందిన ముగ్గురి పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..

తాము శాంతి చర్చల కమిటీని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఇటు నక్సలైట్లు శాంతి చర్చలు జరపాలని, ఒకరి మీద ఒకరు దాడులు చేయవద్దని, ఆయుధాలు ఉపయోగించవద్దని కోరామని తెలిపారు.. దీనికి నక్సలైట్లు స్పందించి మేము కాల్పుల విరమణ పాటిస్తాము ,శాంతి చర్చలకు సిద్ధమే, ప్రభుత్వం అనువైన వాతావరణ కల్పించినట్లయితే మేము చర్చలకు వస్తామనిప్రకటించారు నక్సలైట్లు స్పందించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారు చర్చల ప్రసక్తే లేదు అని ప్రకటించి నారు. కాగా తాము కలిసినప్పుడు ఇది సామాజిక అంశమని ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల వేటకు 20 వేల మంది పోలీసులను కర్రెగుట్ట ప్రాంతంలొ కోంబింగ్ ఆపరేషన్లకు పంపారు.. తాము శాంతి చర్చలకు పిలుపు నిచ్చిన తర్వాత దాదాపు పదిమంది నక్సలైట్లు 22 మంది గిరిజనులు, ముగ్గురు గ్రౌండ్ పోలీసులు చనిపోయారు.. ఒక ఎస్సై తీవ్రంగా గాయపడ్డాడు.. అంతకు ముందు ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఎస్సైలు గాయపడినట్లు తెలుస్తున్నది.. ఈ విధంగా ప్రాణనష్టం జరుగుతూనే ఉంది .ఇటువంటి ప్రాణ నష్టం నివారించాలని తాము కోరుకున్నట్లు తెలిపారు.. ఒక పోలీస్ అయినా ఒక ఆదివాసి అయినా ఒక నక్సలైట్ అయిన ఎవరిదైనా ప్రాణమే కాబట్టి ప్రాణాలు పోవద్దని వారు ఇరు పక్షాలకు విజ్ఞప్తి చేశారు.. ఇప్పటికైనా ఘర్షణ ముగించి ఇరుపక్షాలు కూర్చొని చర్చించి శాంతిని చేకూర్చాలని.. ఆదివాసి ప్రజల జీవితాలు అల్లకలోలం కాకుండా చూడాలని ఇరుపక్షాల వారిని కోరారు.. విజ్నతతో ఆలోచించాలని మనవి చేశారు.. అదే విధంగా చనిపోయిన అగ్నివీర్ సైనికుల కుటుంబాలను, గ్రేహౌండ్ కుటుంబాలను ఆదుకోవాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని లేదా నెల నెలా పెన్షన్ లేదా అయిదు ఎకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలని శాతి చర్చల కమిటీ అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్, కో ఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ లు ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here