Home తెలంగాణ అమిత్ షా కి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ..

అమిత్ షా కి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ..

0
83
Program under the leadership of Challa Narsimha Reddy in Kongara Kalan.. Chigirintha Parijata Narsimha Reddy participated in this rally called by AICC.
Program under the leadership of Challa Narsimha Reddy in Kongara Kalan.. Chigirintha Parijata Narsimha Reddy participated in this rally called by AICC.

కొంగర కలాన్ లో చల్లా నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం..
ఏఐసీసీ పిలుపుమేరకు జరిగిన ఈ ర్యాలీలో పాల్గొన్న చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి..

ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా.. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి ఆధ్వర్యంలో, కొంగర కలాన్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి, అక్కడి నుండి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.. అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు.. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి పాల్గొన్నారు..

ఇంకా ఈ నిరసన ర్యాలీ కార్యక్రమంలో శాసనసభ సభ్యులు వీర్ల పల్లి శంకర్, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు మల్ రెడ్డి రామ్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జైపాల్, మాజీ జడ్పి చైర్మన్ తీగల అనిత రెడ్డి, ఎల్ బి నగర్ పార్టీ నాయకులు రామ్మోహన్ గౌడ్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు చిలుక మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పిసిసి నాయకులు, పార్టీ జిల్లా ఫ్లోర్ నాయకులు జంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మాజీ జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, జిల్లా పార్టీ నాయకులు, మహిళ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here