Friday, October 23, 2026
Google search engine
Homeతెలంగాణఅర్హత కలిగిన లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి

అర్హత కలిగిన లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్

ఎల్బీనగర్

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలను అరికట్టి పారదర్శకంగా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరుతూ హైదరాబాద్ మహా నగర పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు గురువారం తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీ.పి.గౌతమ్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎల్బీనగర్,కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరి, ఉప్పల్, మహేశ్వరం, అంబట్ పేట నియోజకవర్గాల శాసనసభ్యులు ఆయా ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో చోటు చేసుకున్న అక్రమాలను వీపీ గౌతమ్ దృష్టికి తీసుకెళ్లారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో నిజమైన పేదలకు కాకుండా మంత్రులు, అధికారుల సిఫారసుల ఆధారంగా ఎలాంటి లాటరీ పద్ధతి లేకుండా ఇష్టారాజ్యంగా కేటాయిస్తున్న విషయం ఆధారాలతో చూపించారు. అదేవిధంగా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇష్టారాజ్యానికి ఇందిరమ్మ కమిటీలకు ఎంపిక ప్రక్రియను వదిలివేయడం ద్వారా నిజమైన పేదలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు.నిజమైన పేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అక్రమార్కులకు,అడ్డదారిలో కేటాయింపులు జరిపితే సహించేది లేదని గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో సెక్రటేరియట్ ముట్టడిస్తామని ఎల్బీనగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments