స్పేస్ఎక్స్ స్టార్‌షిప్‌తో ప్రయాణించే అవకాశం
సాధ్యం చేసే ప్రయత్నాల్లో మస్క్
వ్యోమనౌక అంటే వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లేది అనే అర్థం మారే అవకాశం ఉన్నది. వ్యోమనౌకను సూపర్‌ఫాస్ట్ విమానంగా వినియోగించేందుకు స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రపంచంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించాలని మస్క్ భావిస్తున్నారట. తన స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన స్టార్‌షిప్ వ్యోమనౌక ద్వారా అంగారకుడిపైకి మనుషులను పంపించాలని ఇంతకాలంగా మస్క్ ప్రణాళిక. అయితే, భూమిపై మనుషుల ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు స్టార్‌షిప్‌ను వినియోగించాలని మస్క్ వ్యూహాలు రచిస్తున్నట్టు ఒక కథనం వెలువడింది. స్టార్‌షిప్ ద్వారా సాధారణ విమాన ప్రయాణ దూరాన్ని దాదాపు 2,200 శాతం తగ్గించొచ్చని మస్క్ భావిస్తున్నట్టు ‘యూనిలాడ్ టెక్’ వార్తాసంస్థ పేర్కొన్నది.