హైదరాబాద్:
పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ చైర్మన్, పూర్వ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కీ గౌడ్ ఆయనను స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్కు పుష్పగుచ్చం అందించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరింత సేవలందించే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ అభినందన కార్యక్రమంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ సంచాలకులు పాశం అశోక్ గౌడ్, వనస్థలిపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొల్లూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు ఎంపీని కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.


