Home తెలంగాణ ఎంపీ ఈటలకు వినతి పత్రం అందజేత..

ఎంపీ ఈటలకు వినతి పత్రం అందజేత..

0
61
Residents of Subhadra Nagar Colony met MP Etala in the presence of the Corporator,,
Residents of Subhadra Nagar Colony met MP Etala in the presence of the Corporator,,

కార్పొరేటర్ సమక్షంలో ఎంపీ ఈటలను కలిసిన సుభద్ర నగర్ కాలనీ వాసులు,,

హయత్ నగర్ డివిజన్ లోని సుభద్ర నగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కాలనీ అభివృద్ధిపై మంగళవారం స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డితో కలసి మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ని ఆయన నివాసంలో కలవడం జరిగింది, ఈ సందర్భంగా వారు సుభద్ర నగర్ కాలనీలో మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేసి దాదాపు 30 సంవత్సరాలు గడవడంతో, ప్రస్తుతం ఉన్న జనాభా సంఖ్యకు ఆ కాలం నాటి మంచినీటి పైప్ లైన్ సరిపోవడం లేదని, కావున నూతన మంచినీటి పైప్ లైన్ సదుపాయం ఏర్పాటు చేసే విధంగా నిధులు మంజూరు చేయాలని ఎంపీకి కాలనీవాసులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు లక్ష్మణ స్వామి, హర గోపాల్, మూర్తి, సుబ్రహ్మణ్యం, సురేష్ తదితరులు పాల్గొన్నారు..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here