Monday, September 28, 2026
Google search engine
Homeతెలంగాణఎస్ఆర్కేపురంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు

ఎస్ఆర్కేపురంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు

ఎల్బీనగర్:

మహేశ్వరం నియోజకవర్గం శ్రీ రామకృష్ణాపురం డివిజన్ పరిధిలోని ఎస్ఆర్కే పురం కాలనీ (ITDES) చౌరస్తాలో స్వాతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రివర్యులు స్వర్గీయ తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111 వ జయంతి సందర్భంగా ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న గణేష్ నేత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ మహానీయునికి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు పున్న గణేష్ నేత మాట్లాడుతూ 1969 లో తెలంగాణ కోసం మంత్రి పదవీ వదులుకొని స్వరాష్ట్రం కోసం పరితపించిన తొలితరం ఉద్యమకారుడు, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా రాజకీయాలకు వన్నెతెచ్చిన మహానుభావుడని కొనియాడారు. ఎల్బీనగర్ టీమ్స్ హాస్పిటల్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ప్రకటించినందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిలుక ఉపేందర్ రెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావ్, ఎన్టీఆర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు ముప్పిడి లింగస్వామి గౌడ్, పెద్దవూర సైదులు, బొడ్డుపల్లి మహేందర్, దుబ్బాక శేఖర్, మామిడి రామకృష్ణ గౌడ్, దుర్గా ప్రసాద్, మహమ్మద్, పగడాల ఏల్లన్న, వెంకట రమణ రెడ్డి, (రాజు), బిక్షపతి గౌడ్, ITDES కాలనీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు వాసవి కాలనీ రోడ్ నెంబర్ 1/A వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు మల్లేష్ యాదవ్, లింగారెడ్డి రెడ్డి, శ్రీధర్ రెడ్డి హరిపురి కాలనీ సెక్రెటరీ, ప్రభాకర్ రెడ్డి సత్య నారాయణ, వర్ణలీల, పిస్కే నరేందర్, నరసింహా రావు షఫీ, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments