Home ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పిన నారా లోకేష్..

ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పిన నారా లోకేష్..

0
95
Devotees post that there is a lack of cleanliness in the temple premises
Devotees post that there is a lack of cleanliness in the temple premises

ఆల‌య ప్రాంగ‌ణంలో ప‌రిశుభ్ర‌త లోపించిందంటూ భ‌క్తుల పోస్టులు
తాగు నీరు కూడా లేద‌ని విమ‌ర్శ‌
నెట్టింట వైర‌ల్‌గా మారిన వీడియోలు
మ‌రోసారి ఇలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌వ‌ని హామీ ఇచ్చిన మంత్రి

విజ‌య‌వాడ దుర్గ‌గుడి వ‌ద్ద అధ్వాన ప‌రిస్థితులు ఉన్నాయంటూ ప‌లువురు భ‌క్తులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేశారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ప‌రిశుభ్ర‌త లోపించింద‌ని, తాగు నీరు కూడా లేద‌ని విమ‌ర్శించారు. అస‌లు ఈ ఆలయానికి ఈవో ఉన్నారా? అంటూ ప్ర‌శ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటివి చూడాల్సి రావడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. దీంతో ఈ వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

దాంతో ఈ స‌మ‌స్య‌పై ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని అన్నారు. మ‌రోసారి ఇలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌వ‌ని హామీ ఇచ్చారు. ఈ మేర‌కు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here