Home Uncategorized ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..

ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..

0
92
Program on the occasion of the birthday of former minister Sabitha Indra Reddy..
Program on the occasion of the birthday of former minister Sabitha Indra Reddy..

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా కార్యక్రమం..
వైద్య శిబిరం సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వైద్యులు..
ఈ శిబిరంలో వైద్య సలహాలు, పరీక్షల నిర్వహణ..

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు, స్థానిక ప్రజలందరికీ వైద్య సలహాలు, పరీక్షలు, ఆరోగ్య సూచనలు అందించారు..

ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, ఎండీ, డా. బాలరాజు నాయుడు, డా. మార్కండేయులు, డా. రాజశేఖర్ పప్పు, డా. రవికిరణ్, డా. జగదీష్ కుమార్, డా. శేఖర్ లు పాల్గొని ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. “ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా సామాన్య ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించిన డాక్టర్ బాలరాజు నాయుడు, వారి బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. డా. రాజశేఖర్ పప్పు, డా. శేఖర్, డా. మార్కండేయులు, మిగిలిన వైద్య సిబ్బంది అందరూ సేవా దృక్పథంతో పనిచేయడం నిజంగా అభినందనీయమైనది.” ఈ తరహా కార్యక్రమాలు ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంచటంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని ఆమె అన్నారు.. సామాజిక బాధ్యతగా ఆరోగ్య సేవలు అందించిన ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ యాజమాన్యం డా. బాలరాజు నాయుడుని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here