ఎల్బీనగర్
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ రంగారెడ్డి జిల్లా కమిటీ, నియోజకవర్గ, డివిజన్ చైర్మన్ లకు నియామక పత్రాలను ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారి చేతుల మీదుగా ఈ రోజు హయత్ నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో అందజేయడం జరిగింది. ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్సీ డిపార్ట్మెంట్ నియోజకవర్గ చైర్మన్ గా ఉరిపక్క రవికుమార్ గారికి, జిల్లా వైస్ చైర్మన్ గా పోగుల నరసింహ, ప్రధాన కార్యదర్శులుగా నరేష్, పెద్దలు, మహాలక్ష్మి, నాగోల్ డివిజన్ అధ్యక్షులుగా కాటేపాక బాలు, ఈఎస్ఐ డివిజన్ అధ్యక్షుడు చైర్మన్ గా పంగా గౌతం, మనసురాబాద్ డివిజన్ చైర్మన్ గా ప్రశాంత్, లెక్చరర్స్ కాలనీ డివిజన్ చైర్మన్ గా నాగరాజు, సాహెబ్ నగర్ డివిజన్ చైర్మన్ గా భవాని సరస్వతి, చింతలకుంట డివిజన్ చైర్మన్ గా బాలకృష్ణ, హస్తినాపురం డివిజన్ చైర్మన్ గా దర్గా శ్రీను, గడ్డి అన్నారం డివిజన్ చైర్మన్ గా అనసూయ శాంతి, చైతన్యపురి డివిజన్ చైర్మన్ గా మేకల కృష్ణ, కొత్తపేట డివిజన్ చైర్మన్ గా కుంభం మహేష్, లింగోజిగూడ డివిజన్ చైర్మన్ గా కప్పరి శ్రీనివాస్ లకు నియామక పత్రాలను అందజేశారు.


