రైతులను రెచ్చగొడుతున్న బీ.ఆర్.ఎస్. నాయకులు..
ఆందోళన వ్యక్తం చేసిన కప్పాటి పాండురంగా రెడ్డి..
శుక్రవారం నాడు ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అందుగుల సత్యనారాయణ, ఉండెల బాబురావు, సభావట్ గణేష్ నాయక్ లు మాట్లాడారు..
కేంద్ర ప్రభుత్వ అసమర్థతో యూరియా దిగుమతి కాలేదు . రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరాలో ఘోరంగా వైప్యలం చెందింది.. దీనిని అవకాశంగా తీసుకుని బిఅర్ఎస్ నాయకులు కేంద్ర అసమర్థతను ప్రశ్నించకుండా.. రైతులను రెచ్చగొట్టేలా బిజేపితో కుమ్మకై.. అవగాహన లేకుండా కాంగ్రెస్ ను నిందించడం, ప్రజలను రెచ్చగొట్టడం బిఅర్ఎస్ నాయకులకే చెల్లిందని వారు అన్నారు. రైతులకు ఇప్పటివరకు 7.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ప్రజా ప్రభుత్వం ద్వారా పంపిణీ జరిగింది. ఆగస్టు వరకు కేంద్రం రాష్ట్రానికి 3.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించారు. అందులో కేవలం 2.10 లక్షల మెట్రిక్ టన్నులే సరఫరా చేయడం జరిగింది. ఆర్.ఎఫ్.సి.ఎల్. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో 78 రోజులు ఉత్పత్తి నిలిచిపోవడంతో యూరియా రాలేదు. రాష్ట్రానికి 1.69 లక్షల మెట్రిక్ టన్నుల కేటాయింపులో 1.07 లక్షలే సరఫరా చేశారు. మొత్తం 2.58 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఏర్పడింది. కేంద్ర వైఫల్యాన్ని రాష్ట్రంపై నెట్టాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా చాల రాష్ట్రాలలో యూరియా కొరత ఉంది. కానీ, తెలంగాణలో మాత్రమే యూరియా కొరత ఉన్నట్లు బీజేపీ నేతలు, బిఅర్ఎస్ నాయకులు కలిసి అబద్ధాలు చెబుతున్నారు.’
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి నెల నుంచి ప్రతి నెలా కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాతో ఈ విషయంపై చర్చించారని, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు కూడా ఈ సమస్యను లేవనెత్తుతూనే ఉన్నారు.. పార్లమెంట్ లో కూడా ఆందోళన కూడా చేసారన్న విషయం తెలంగాణాతో పాటు, దేశ ప్రజలకు తెలిసునని.. రైతులను రెచ్చగొట్టి రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకుందామనే చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని బిఅర్ఎస్ నాయకులకు సూచించారు. గతంలో రైతులకు ఉచిత ఎరుపులు ఇస్తామన్న హామి ఏమైంది.? గతంలో రైతులు సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకుని ఘెరావ్ చేసిన సంఘటనలను, ఖమ్మం రైతులకు బేడీలు వేసి స్టేషనలో పెట్టి, రోజుల కొద్ది పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా.. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయించిన రోజులు సబితా ఇంద్రారెడ్డి మరిచినట్టున్నారు.అని పాండురంగా రెడ్డి అన్నారు..


