Friday, February 13, 2026
Google search engine
Homeతెలంగాణగోరింటాకు మహోత్సవం..

గోరింటాకు మహోత్సవం..

నాంపల్లి భాగ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం..
విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమం..

ఆర్యవైశ్య సంఘం జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో గోరింటాకు మహోత్సవాన్ని శనివారం నాంపల్లిస్థానిక ఆర్యవైశ్య జిల్లా సంఘం భవనంలో మహిళలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వాసవి మాత అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం హాజరైన వందలాదిమంది మహిళలలకు తంబోలా గేమ్స్ నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరము సామూహికంగా చెట్ల నుండి గోరింటాకును తీసుకువచ్చి, గౌరీ దేవి ముందు ఉంచి శాస్త్రక్తంగాప్రత్యేక పూజలు నిర్వహించారు.గౌరీ పూజ అనంతరం సంప్రదాయబద్ధంగా గోరింటాకు నూరి, చేతులపై రకరకాల డిజైన్లలో పెట్టు కున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూఏ శుభకార్యం జరిగినా గోరింటాకు ను పెట్టుకోకుండా మహిళలు శుభకార్యాలు మొదలు పెట్టరని అన్నారు.గోరింటాకు వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని, గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పారు. అందరం కలిసికట్టుగా ఉండి గోరింటాకు పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళలకు మానసికంగా ఎంతో ఊరట కలుగుతుందని చెప్పారు. ఆషాడ మాసంలో మహిళలందరూ గోరింటాకు పెట్టుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుందని, అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పట్టణ జిల్లా ఆర్యవైశ్య సంఘం, మహిళలు కాసం శోభారాణి,బండారు జ్యోతి, వనమా పద్మ, కొమిరిశెట్టి రమాదేవి,గుబ్బ లీలారని,పెట్నకోట హరిత ,వనమా శోభారాణి,లక్ష్మి శెట్టి పారిజాత,లకుమారపు సునీత ,సోమ హైమావతి, మురారి శెట్టి నందిని,సోమా దీప్తి,మిట్టపల్లి కలమ్మ, మురారి శెట్టి రత్నమాల, తల్లం కల్పన, మిర్యాల సౌభాగ్య, మురారి శెట్టి సునీత, తుంకునూరి సునీత, బండారు వాణి పాలారపు హేమలత, మిట్టపల్లి పవన్ ,వేలుపెల్లి పద్మ ,తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments