సంబంధిత శాఖలతో పూర్తి స్థాయి విచారణకు ఆదేశం..
ఓఆర్ ఆర్ కు చేరువుగా ఉన్న పలు చెరువులను సోమవారం నాడు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. చెరువుల ఆక్రమణలపై ప్రజలతో పాటు.. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. నానక్‌రామ్‌గూడకు చేరువలో ఉన్న తౌతానికుంట, భగీరథమ్మ చెరువు, నార్సింగ్‌లోని నెక్నాంపూర్ చెరువుల ఆక్రమణలపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

తౌతాని కుంట, భగీరథమ్మ చెరువుల ఆక్రమణలతో పాటు.. ఆయా చెరువల్లోకి వరద నీరు చేరకుండా కాలువలను మల్లించడం, మూసివేయడంపై రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ ఎంసీ, హెచ్ ఎం డీఏ అధికారులతో క్షుణ్నంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని హైడ్రా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. చెరువులలో మట్టిపోయడంతో పాటు ఆఖరుకు వరద కాలువలను కూడా కనిపించకుండా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు..

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఖాళీస్థలంలో వర్షపు నీరు వెళ్లే రహదారులు మూసుకుపోవడంతో తమ అపార్టుమెంట్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది వాపోయిన స్థానికులు. నానాక్‌రామ్‌గూడ ప్రధాన రహదారికి ఎగువున ఉన్న తౌతాని కుంట చెరువు నీరు.. దిగువవైపు ఉన్న భగీరథమ్మ చెరువుకు వెళ్లే కాలువ లింకు తెగిందని పిర్యాదు చేశారు స్థానికులు. నానక్‌రామ్‌గూడకు ఉన్న ఇరువైపులా వరదనీటి కాలువలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు, దుకాణాలను తొలగించాలని కమిషనర్ సాదేశాలు జారీ చేశారు.. యూనివర్సిటీ ఖాళీ స్థలంలోంచి వరద నేరుగా తౌతాని కుంటకు.. తర్వాత భగీరథమ్మ చెరువుకు చేరితే ఈ ఇబ్బంది తొలుగుతుందని స్థానికులు విజ్ఞప్తి చేశారు.. చెరువులకు ఆనుకుని ఉన్న స్థలాలు తమవంటూ పలువురు కమిషనర్‌ను కలువగా.. పూర్తి వివరాలను హైడ్రాకు సమర్పిస్తే.. క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఏవీ రంగనాథ్. గ్రామీణ మ్యాప్‌లతో పాటు.. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ విభాగాలకు చెందిన మ్యాప్‌లతో పూర్తి స్థాయి పరిశీలన జరిపించి వారం రోజుల లోపు నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. నార్సింగ్ దగ్గర మూసి నది పరీవాహక ప్రాంతాన్ని కూడా కమిషనర్ రంగనాథ్ రిశీలించారు. కొన్ని నిర్మాణ సంస్థలు మూసి నదిలోకి పోసిన మట్టిని తొలగించాలని ఆదేశించారు. బఫర్ జోన్లోకి మట్టిపొస్తే ఆయా సంస్థలపై చర్యలుంటాయని హెచ్చరించారు.