Home తెలంగాణ చెరువులు.. నాలాలు కబ్జాకు గురైతే 8712406899కు సమాచారమివ్వండి

చెరువులు.. నాలాలు కబ్జాకు గురైతే 8712406899కు సమాచారమివ్వండి

0
51
Hydra seizes the city's people..
Hydra seizes the city's people..

నగర ప్రజలకు హైడ్రా విజ్జప్తి..

నగరంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మొదటి విడతగా నగరంలోని 6 చెరువుల పునరుద్ధరిస్తోంది. నగరానికి వరద ముప్పు తప్పించాలంటే గొలుసుకట్టు చెరువులు కీలక పాత్ర పోషిస్తాయి. వర్షం పడితే వరద నీరు రహదారులు, నివాస ప్రాంతాలను ముంచెత్తకుండా.. నేరుగా చెరువుల్లోకి చేరేలా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. చెరువులు, నాలాలను పరిరక్షించడం ఎంతో అవసరమని అందరూ గ్రహించాలని సూచిస్తోంది. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రతువులో నగర ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతోంది. మీ పరిధిలో చెరువులు, నాలాలు కబ్జాకు గురవుతుంటే ఆ సమాచారాన్ని హైడ్రా వాట్సాప్ నంబరు 8712406899 కు పంపాలని విజ్ఞప్తి చేస్తోంది. ఫొటోలతో పాటు.. ప్రాంతాలను తెలియజేసే లొకేషన్ను షేర్ చేయమంటోంది. కమిషనర్ హైడ్రా పేరిట ఉండే ట్విట్టర్ (ఎక్స్), ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్లలో కూడా సమాచారం అందజేయాలని కోరుతోంది. 7207923085 నంబరు ద్వరా నేరుగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కి కూడా సమాచారం పంపాలని విజ్ఞప్తి చేస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here