Saturday, November 14, 2026
Google search engine
Homeతెలంగాణచైన్ మన్ తిరుమలేష్ కనుసన్నల్లో అక్రమ నిర్మాణాల జోరు...

చైన్ మన్ తిరుమలేష్ కనుసన్నల్లో అక్రమ నిర్మాణాల జోరు…

  • *​అధికారుల పేర్లు చెప్పి బేరాలు.. నోటీసులు అడ్డుకుంటూ అక్రమార్కులకు వత్తాసు!
  • *​ప్రజాప్రతినిధుల పేరుతో బెదిరింపులు.. ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి!
  • *​వనస్థలిపురం డివిజన్ లో పదుల సంఖ్యలో భారీ అక్రమ నిర్మాణాలు వ్రాతపూర్వక ఫిర్యాదులపై చర్యలు శూన్యం..
  • లక్షల్లో ప్రభుత్వ ఖజానాకు రావలసిన పన్ను గండి కొడుతూ సొంత జేబుల్లోకి మళ్లించుకుంటున్న చైన్ మన్ తిరుమలేష్..
  • *​విజిలెన్స్ విచారణ జరిపి తిరుమలేష్ బాగోతాన్ని బయటపెట్టాలని స్థానికుల డిమాండ్!
  • *​పోలీస్ స్టేషన్ ఎదుటే అక్రమ నిర్మాణాలు.. అయినా పట్టించుకోని టౌన్ ప్లానింగ్!
  • ఈ వార్త కథనంలోని ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి ఫైర్ కంప్లైంట్గా హైడ్రా స్వీకరించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్..
  • మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్ హయత్ నగర్ సర్కిల్ 14 లో జరుగుతున్న అవినీతిపై జోనల్ కమిషనర్ వికాస్ మహతో, ఎం.ఎం.సి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టి సారించాలి

ఎల్.బి.నగర్
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్
హయత్‌నగర్ సర్కిల్ 14 పరిధిలోని వనస్థలిపురం డివిజన్‌లో అక్రమ నిర్మాణాలు హద్దు అదుపు లేకుండా సాగుతున్నాయి. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఎల్బీనగర్ జోన్ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ కట్టడాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. ఈ వ్యవహారంలో చైన్‌మ్యాన్ తిరుమలేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. నిర్మాణాలు జరుగుతున్న స్థలాలకు వెళ్లి బేరాలు కుదుర్చుకోవడం, అధికారుల పేర్లు చెప్పి వసూళ్లకు పాల్పడటం ఇక్కడ పరిపాటిగా మారింది.

అధికారుల పేర్లతో దందాలు, ఫైళ్ల తారుమారు:
ఏదైనా నిర్మాణంపై ఫిర్యాదు రాగానే అధికారులు నోటీసులు సిద్ధం చేస్తే, ఆ నోటీసులు బాధితులకు చేరకుండా మధ్యలోనే తిరుమలేష్ అడ్డుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. సెకండ్ నోటీస్, థర్డ్ నోటీస్, కూల్చివేత ఉత్తర్వులు రాకుండా అడ్డుకుంటూ ఇటు అధికారులను, అటు ప్రజలను మభ్యపెడుతూ మోసపూరితంగా వ్యవహరిస్తున్నాడు. కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి అధికారులను భయపెడుతూ ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల రాబడికి గండి కొడుతున్నాడు.

ప్రత్యక్ష ఆధారాలు – మూడు భారీ అక్రమ నిర్మాణాలు

  • జనప్రియ కాలనీ: చింతలకుంట బజాజ్ షోరూం వెనుక వైపు ఎటువంటి అనుమతులు లేకుండా భారీ అక్రమ నిర్మాణం కొనసాగుతోంది.
  • ఎఫ్.సి.ఐ కాలనీ: వంద అడుగుల ప్రధాన రహదారిని ఆనుకుని అక్రమ పద్ధతిలో భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు.

*బి.వీ.కే విజయలక్ష్మి థియేటర్ పాత నిర్మాణానికి అనుకొని సెట్ బ్యాక్ వదిలిన 200 గజాల స్థలంలో అనుమతులు లేకుండానే అక్రమ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.. భవిష్యత్తులో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రాణం నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు..

  • పోలీస్ స్టేషన్ ఎదురుగా: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ముందే రెండు భారీ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
    ఈ నిర్మాణాలపై స్థానికులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినా అధికారుల అలసత్వం, తిరుమలేష్ చాకచక్యంతో పనులు ఆగడం లేదు.
    ఈ విషయంపై హయత్ నగర్ సర్కిల్ 14 చైన్ మెన్ తిరుమలేష్ అవినీతిని,, సంబంధిత అధికారులైన టౌన్ ప్లానింగ్ ఏసిపి విజయలక్ష్మి, టీ.పి.ఎస్ సోమేష్ కుమార్ నీ ప్రశ్నిస్తే .. ఈ ఛైన్మెంట్ తిరుమలేష్ గారు ఎవరి ఫోను ఎత్తరు.. విధులు సక్రమంగా నిర్వహించడు.. దుర్గ దౌర్జన్యంగా వ్యవహరిస్తాడని అధికారులు సమాధానం చెప్పడం ఆశ్చర్యాన్ని గురి చేస్తున్న విషయం..
    అక్రమాలను ప్రోత్సహిస్తున్న అవినీతి ప్రభుత్వ ఉద్యోగి పై వెంటనే దృష్టి సారించి ఉన్నతాధికారులు
    మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో తక్షణమే స్పందించి విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ అజ్మీరా స్వామి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి వాస్తవాలను బయటకు తీయాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments