ఎల్బీనగర్:
సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో “డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్- రంగారెడ్డి జిల్లా ” వారు నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో గురువారం సరూర్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభను చాటారు. ఐదు అంశాలలో నిర్వహించిన ఈ పోటీలలో జానపద నృత్యంపై నిర్వహించిన పోటీలో ఎస్కే.రాహేల, మౌనిక, మహేశ్వరీ, టేకమ్మ, వసంత, లావణ్య, కరుణ కీర్తీలకు ద్వితీయ బహుమతి, అలాగే ఎస్కే సయ్యద్ బైపీసీ -1 కు పెయింటింగ్ లో ద్వితీయ బహుమతి, మౌనిక సిఇసి-1 కు కవితా రచనలో కన్సోలేషన్ బహుమతి రావడం జరిగింది.ఈ విజేతలను కళాశాలలో ఘనంగా సత్కరించారు. తర్వాత ప్రిన్సిపాల్ శ్రీమతి అనురాధ మాట్లాడుతూ, వీరిని ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా వారికి ప్రతిభగల అంశాలలో రానించాలని, అప్పుడే మంచి గుర్తింపు పొందగలుగుతారని, అలాంటి విద్యార్థులకు కళాశాల తరుపున ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. అలాగే విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది అందరు పాల్గొన్నారు.


