Monday, September 21, 2026
Google search engine
Homeతెలంగాణజీవో 118 ఉచ్చు వీడింది.. పూర్తి యాజమాన్య హక్కులతో కాలనీవాసులకు సేల్ డీడ్ల పంపిణీ

జీవో 118 ఉచ్చు వీడింది.. పూర్తి యాజమాన్య హక్కులతో కాలనీవాసులకు సేల్ డీడ్ల పంపిణీ

  • మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ప్రత్యేక కృషితో పరిష్కారమైన రిజిస్ట్రేషన్ల చిక్కుముడి
  • ఆనందోత్సాహాలతో స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపిన వైదేహి, బి.యన్.రెడ్డి నగర్ కాలనీవాసులు
  • రాత్రికి రాత్రే ఆస్తుల విలువ ముప్పాతిక శాతం వృద్ధి.. సంతోషం వ్యక్తం చేసిన మార్నింగ్ వాకర్స్

ఎల్బీనగర్

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చొరవతో దశాబ్దాల కాలనీవాసుల రిజిస్ట్రేషన్ల సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. జీవో 118 నిబంధనల పేరుతో అష్టకష్టాలు పడ్డ వేలాది కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి యాజమాన్య హక్కులతో కూడిన ‘సేల్ డీడ్’ పత్రాలను అందజేయడంపై కాలనీ సంక్షేమ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం బి.యన్.రెడ్డి నగర్ డివిజన్‌లోని ఎన్జీవోస్ కాలనీ వివేకానంద పార్క్, రాజీవ్ గాంధీ పార్కులను సందర్శించిన ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్ పర్సన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారిని కాలనీవాసులు కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

*జీవో లోపాలను సవరించిన వైనం
గత ప్రభుత్వ హయాంలో జీవో 118 పేరుతో జారీ చేసిన ‘డీడ్ ఆఫ్ కన్వీనియన్స్’ పత్రాల వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆస్తులపై సర్వహక్కులు లేకపోవడంతో బ్యాంకు రుణాలు పొందలేక, గిఫ్ట్ డీడ్లు, మార్టిగేజ్ చేసుకోలేక నానాపాట్లు పడ్డారు. ఈ సమస్యను కాలనీ సంక్షేమ సంఘాలు మధుయాష్కి గౌడ్ గారి దృష్టికి తీసుకురాగా, ఆయన ఒక నిపుణుడైన న్యాయవాదిగా చట్టపరమైన లోపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. జీవోలోని ప్రతిబంధకాలను తొలగించాలని ముఖ్యమంత్రికి, రెవెన్యూ శాఖ మంత్రికోసం ప్రత్యేకంగా ప్రతిపాదనలు అందజేశారు. ఆయన చేసిన ఈ నిరంతర కృషితోనే ప్రభుత్వం జీవోలో మార్పులు చేసి, నేడు పూర్తి స్థాయి యాజమాన్య హక్కులతో సేల్ డీడ్లు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది.

*ఒక్కసారిగా పెరిగిన ఆస్తుల విలువ
కొత్త సేల్ డీడ్ల రాకతో తమ స్థలాలు, గృహాల మార్కెట్ విలువ ఒక్కసారిగా ముప్పాతిక శాతం పెరిగిందని కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఆపద వస్తే సగం ధరకే ఆస్తులను విక్రయించుకోవాల్సిన దుస్థితి ఉండేదని, నేడు ప్రభుత్వం సరైన యాజమాన్య హక్కులు కల్పించడంతో ఆస్తులకు అసలైన విలువ వచ్చిందని కొనియాడారు. ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) అవసరం లేకుండా, ప్రభుత్వ సంస్థల ఆటంకాలు లేకుండా తమ ఆస్తులను అమ్ముకోవడానికి, బ్యాంకు రుణాలు పొందడానికి మార్గం సుగమమైందని సంతోషం వెలిబుచ్చారు. అంతేకాకుండా, ఇప్పటివరకు నిషేధిత ఆస్తుల జాబితా (22A)లో ఉన్న భూములను కూడా ఆ జాబితా నుంచి పూర్తిగా తొలగించడం జరుగుతుందని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, ముద్దగోని లక్ష్మీప్రసన్న, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు పర్వతి గణేష్ రెడ్డి, శ్రీనాథ్, రమేష్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, అలాగే వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు దామోదర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ప్రదీప్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments