హైదరాబాద్,
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను డీజీపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సాహిత్య సేవలను, ప్రజా సమస్యలపై తన రచనల ద్వారా కల్పించిన చైతన్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
కార్యక్రమంలో ఐజీ గజరావు భూపాల్, మల్టీజోన్- II ఐజీ షానవాజ్ ఖాసిం, ఏఐజి అడ్మిన్ జె. అన్యోన్య , టి జి స్పార్క్ ఎస్పి రూపేష్, పేషీ డీఎస్పీ భాస్కర్, స్టోర్స్ డీఎస్పీ సత్యనారాయణ, సీఎస్‌ఓ యోగేశ్వరరావుతో పాటు ఇతర అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


