Home తెలంగాణ తగినన్ని నిధులు మంజూరు చెయ్యండి..

తగినన్ని నిధులు మంజూరు చెయ్యండి..

0
72
Help in the development and resolution of problems of B.N. Reddy Nagar Division..
Help in the development and resolution of problems of B.N. Reddy Nagar Division..

బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి సహకరించండి..
జోనల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసిన స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..

శుక్రవారం రోజు జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఐఏఎస్ ని జిహెచ్ఎంసి క్యాంపు కార్యాలయంలో కలిసి బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి డివిజన్ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫేస్ 2 లో నూతన ఓపెన్ జిమ్ పరికరాలను పిల్లల ఆట పరికరాలను ఏర్పాటు చేయాలని.. రంగారెడ్డి కాలనీలో నూతన రోడ్ల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని.. సాహెబ్ నగర్ స్మశాన వాటికలో వీధి దీపాలు, ప్రహరీ గోడ, నూతన రంగులుతో అభివృద్ధి చేయాలని కోరారు..

అదే విధంగా డివిజన్ పరిధిలోని బృందావన్ మెడోస్, శ్రీ శ్రీనివాస కాలనీ, సౌభాగ్యనగర్, జక్కిడి కాలనీ లో నూతన రోడ్లు, వీధి దీపాలు, భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మించాలని.. బృందావన్ మెడోస్ మరియు మైల్ స్టోన్ డెవలపర్స్ కాలనీ లో ఓపెన్ జిమ్ పరికరాలను మరియు పిల్లల ఆట పరికరాలను ఏర్పాటు చేయాలని.ఎన్.జీ.ఓస్. కాలనీ, సచివాలయ నగర్ లో జరుగుతున్న ఉమెన్స్ థీమ్ పార్కులో ఓపెన్ జిమ్ పరికరాలను, పిల్లల ఆట పరికరాలను, ప్రహరి గోడకు ఫెన్సింగ్ మరమ్మతులు, ఓపెన్ నాల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరారు.. సచివాలయ నగర్ కాలనీలో పలు నూతన రోడ్లు నిర్మాణం చేపట్టాలని.. లుమిని ఎలైట్స్, మారుతి నగర్, పివిఆర్ కాలనీ, విజయనగర్, బృందావన్ మెడోస్, గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ, శ్రీ గాయత్రి నగర్, మహాలక్ష్మి నగర్, గాయత్రీ నగర్ బ్యాంక్ కాలనీ ఫేస్ 4, భవాని ఎంక్లేవ్ కాలనీలనీ పార్కు స్థలాలకు ప్రహరీ గోడలు నిర్మించాలని కోరారు.. అలాగే ఆఫీసర్స్ కాలనీలోని శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయం నుంచి సామా నగర్ మెయిన్ రోడ్డు వరకు నూతన రోడ్డు నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని జోనల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here