Home తెలంగాణ తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు..

తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు..

0
78
Among those who surrendered are senior CPI Maoist state committee member, DK SZC, ACM..
Among those who surrendered are senior CPI Maoist state committee member, DK SZC, ACM..
  • లొంగిపోయిన వారిలో సీనియర్ సీపీఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు, డీకే ఎస్‌జెడ్‌సి, ఏసీఎం..
  • ఇది తెలంగాణ పోలీసుల వ్యూహ రచనకు తార్కాణమని పోలీసుల వెల్లడి..
  • “ఆయుధాలు వదిలిపెట్టి.. అజ్ఞాతవాసాన్ని విడిచిపెట్టి.. ప్రజా జీవితంలో
    ప్రధాన ప్రవాహంలో చేరండి” అని పిలుపునిస్తున్న తెలంగాణ పోలీసులు..

సుమారు 40 ఏళ్లుగా విప్లవోద్యమంలో చురుకుగా ఉన్న సీపీఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సీనియర్ అండర్‌గ్రౌండ్ సభ్యురాలు కాకర్ల సునీత అలియాస్ బద్రి అలియాస్ లక్ష్మి అలియాస్ గురుస్మృతి అలియాస్ సరోజ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన ఏసీఎం చెన్నూరి హరీష్ అలియాస్ రమణలు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు..

సీనియర్ మావోయిస్టు నాయకులు లొంగిపోవడంతో పోలీసుల వ్యూహాలకు దక్కిన విజయంగా చూడొచ్చు.. సీనియర్ మావోయిస్టు నాయకురాలు కాకర్ల సునీత డీకే ఎస్‌జెడ్‌సి రాష్ట్ర కమిటీ సభ్యురాలు.. రీజినల్ పొలిటికల్ స్కూల్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కమిటీ సభ్యురాలు కూడా.. ఇక ఆమెతో పాటు చెన్నూరి హరీష్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు.. వీరిరువురూ పోలీసులకు లొంగిపోయారు..

ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు.. తెలంగాణకు చెందిన మావోయిస్టులు తమ గ్రామాలకు తిరిగి వచ్చి, రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.. సీపీఐ మావోయిస్టు ఉద్యమం నుంచి బయటకు వచ్చి ప్రధాన ప్రవాహంలోకి చేరే ప్రతి ఒక్కరికీ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకాల ప్రయోజనాలు అందించబడతాయని తెలిపారు..

లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు ఇలా ఉన్నాయి :

కాకర్ల సునీత.. వయసు: 62 సంవత్సరాలు, కులం: బ్రాహ్మణ, స్వస్థలం వనస్థలిపురం, హైదరాబాద్.. 1985లో రాజమండ్రి ఆర్‌ఎస్‌యూ అంటే ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రభావంతో విప్లవోద్యమంలో చేరారు. 1986 జనవరి నుంచి సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్‌లో అండర్‌గ్రౌండ్‌గా పనిచేశారు. 1986లో సహచరుడు టి.ఎల్.ఎన్. చలంను వివాహం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పనిచేసి, తర్వాత నల్లమల అడవుల్లో 1992–2001 మధ్య ఉన్నారు.

వెలిగొండ, భైరవకొండ ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నారు. 2001లో డివిజనల్ కమిటీ మెంబర్ గా పదోన్నతి పొందారు. ఆ తరువాత ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పనిచేసి, 2006 నుంచి దండకారణ్యంలో సేవలందించారు. 2014లో కూటుల్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు.
05-06-2025న అన్నపురం నేషనల్ పార్క్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొని, తన భర్త చలం మరణించగా, ఆమె తప్పించుకున్నారు. పార్టీ ఐడియాలజీ వ్యాప్తి, వ్యూహ రచన, “క్రాంతి” వంటి పత్రికల ప్రచురణలో కీలక పాత్ర పోషించారు.

ఇక రెండవ వ్యక్తి చెన్నూరి హరీష్.. వయసు: 35 సంవత్సరాలు, కులం: బీసీ (పద్మశాలి), స్వస్థలం: రంగయ్యపల్లి, భూపాలపల్లి జిల్లా..
2006లో మావోయిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడయ్యాడు. 2019లో జైలులో ఉండగా టీపీఎఫ్ నాయకుడు మంచు రమేష్ పరిచయమయ్యాడు. 2020లో మళ్లీ పార్టీలో చేరి, బాడే చోక్కారావు బృందంలో పని చేశాడు. మంగి – ఇంద్రవెల్లి ఏరియా దళంలో సభ్యత్వం పొంది, 2021లో పార్టీ మెంబర్ అయ్యాడు. 2022 డిసెంబర్ 23న టేకమెట్ట ఎన్‌కౌంటర్‌లో పాల్గొనగా కాలికి గాయం అయ్యింది.
2023–2024 మధ్య నేషనల్ పార్క్ ఏరియా కమిటీ టైలరింగ్ టీమ్‌లో పనిచేశాడు. 2024లో ఏసీఎంగా పదోన్నతి పొందాడు. 07-06-2025న ఇర్పగుట్ట ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు ఒక పిలుపునిచ్చారు.. మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టి, అండర్‌గ్రౌండ్ జీవితం విడిచి, ప్రధాన ప్రవాహంలోకి రావాలి. ప్రభుత్వం పునరావాస పథకాల ద్వారా వారికి సహాయం చేస్తుంది. సమాజంలో యువత చైతన్యం పెరిగి, మావోయిస్టు పార్టీలో కొత్త నియామకాలు దాదాపు ఆగిపోయాయి.

మావోయిజం అనేది పాతకాలపు సిద్ధాంతం :

నేటి ప్రపంచంలో మావోయిజం పాతబడ్డ సిద్ధాంతంగా మారింది. ప్రజలు హింసను ప్రోత్సహించే సిద్ధాంతాన్ని తిరస్కరించారు. అనేక దేశాల్లో మావోయిజం అంతరించిపోయింది.

“ఆయుధాలు వదిలిపెట్టి.. అజ్ఞాతవాసాన్ని విడిచిపెట్టి.. ప్రజా జీవితంలో ప్రధాన ప్రవాహంలో చేరండి” అని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here