Friday, October 16, 2026
Google search engine
Homeతెలంగాణతెలంగాణ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

తెలంగాణ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

  • మహిళలు, యువతులు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలిరావాలనీ బద్దూరి పిలుపు
  • ఈ కార్యక్రమంలో పాల్గొననున్న నల్గొండ గద్దర్ నర్సన్న, బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న

ఎల్బీనగర్

తెలంగాణ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయబద్ధంగా సంబురాలు జరుపుకోనున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ విశిష్ట గాయకులు నల్గొండ గద్దర్ నర్సన్న, బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న పాల్గొంటారని, మహిళలు, యువత, కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments