Monday, February 23, 2026
Google search engine
Homeనేషనల్తేజస్ క్రాష్ ప్రభావం:‘అసాధారణ పరిస్థితులు’ కారణమని HAL స్పష్టీకరణ

తేజస్ క్రాష్ ప్రభావం:‘అసాధారణ పరిస్థితులు’ కారణమని HAL స్పష్టీకరణ

దుబాయ్ ఎయిర్ షోలో ప్రదర్శన విమానంగా పాల్గొన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానం శుక్రవారం దుర్ఘటనకు గురైన విషయం తెలిసిందే. తీవ్రమైన విన్యాసాల అనంతరం అదుపు తప్పి కూలిపోయిన ఈ ప్రమాదంలో భారత వైమానిక దళానికి చెందిన పైలట్ వింగ్ కమాండర్ నమాంశ్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు. అనుభవం ఉన్న పైలట్ అయిన నమాంశ్ ఆ రోజు ఎనిమిది నిమిషాల పాటు ఆకర్షణీయమైన ఎయిర్ మెనూవర్స్ ప్రదర్శించిన తర్వాత విమానం ఒక్కసారిగా నేలమట్టం కావడం ఘటనకు మరింత విషాదాన్ని తెచ్చింది. ఈ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే కోర్ట్ ఆఫ్ ఇన్‌క్వైరీని ఏర్పాటు చేసి ఖచ్చితమైన కారణాలను వెలికితీసే ప్రయత్నాల్లో నిమగ్నమైంది.

ఈ సంఘటనపై HAL తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ దానిని “అసాధారణ పరిస్థితుల్లో సంభవించిన ప్రత్యేక దుర్ఘటన”గా పేర్కొంది. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్న ఏజెన్సీలకు పూర్తి సహకారం అందిస్తామని, ఈ ఘటనతో కంపెనీ వ్యాపార కార్యకలాపాలు, భవిష్యత్ డెలివరీలు లేదా ఆర్థిక పనితీర్పుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, మార్కెట్‌లో మాత్రం సంచలనం నెలకొంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే HAL షేర్ భారీ ఒత్తిడికి లోనై ఒక దశలో 8 శాతం వరకు పడిపోయి ₹4,205 స్థాయిని తాకింది. ప్రమాదం కారణంగా పెట్టుబడిదారులలో ఏర్పడిన ఆందోళన షేర్‌పై తాత్కాలిక ఒత్తిడిని పెంచింది.

తేజస్ విమానం తమిళనాడులోని సూలూరు స్క్వాడ్రన్‌కు చెందినదిగా తెలిసింది. ఆధునిక సాంకేతికత, స్వదేశీ అభివృద్ధి, భారత రక్షణ వ్యవస్థలో చిహ్నంగా నిలిచిన తేజస్‌పై జరిగిన ఈ ప్రమాదం అంతర్జాతీయ వేదికలపై భారత వైమానిక సామర్థ్యంపై కూడా చర్చలకు దారితీసింది. తేజస్‌ను ప్రపంచ మార్కెట్‌లో ప్రదర్శించి ఎగుమతి అవకాశాలను పెంచాలనే ఉద్దేశ్యంతో HAL కార్యకలాపాలు కొనసాగుతుండగా, దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన ఈ దుర్ఘటన కంపెనీ ప్రతిష్టపై తాత్కాలిక ప్రభావం చూపించినట్లే కనిపిస్తోంది. అయినప్పటికీ, HAL మరియు IAF కలిసి ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోనున్నట్టు సూచిస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments