మద్దతు తెలియజేసిన తెలంగాణ ఎంప్లాఐఎస్ అసోషియేషన్..
పెన్షన్ విద్రోహ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు..
తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో పాత పెన్షన్ సాధన లక్ష్యంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగుల ఉపాధ్యాయుల చైతన్య యాత్రకు.. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ పూర్తి మద్దతు తెలియజేసింది.. అంతే కాకుండా సెప్టెంబర్ ఒకటో తారీఖున జరగనున్న పెన్షన్ విద్రోహ సభకు ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చింది.. పాత పెన్షన్ అనేది ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు ఎందుకంటే దేశంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కూడా ఐదారు సంవత్సరాలు సేవలందించి పెన్షన్ పొందుతున్నారు, కానీ 35 నుంచి 40 సంవత్సరాలు ప్రజలకు సేవలందించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ నిరాకరించడం చాలా దారుణం. నేటి సమాజంలో వృద్ధాప్యంలో పెన్షన్ లేకుండా జీవించడం చాలా కష్టం. ఇట్టి విషయాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ గమనించి తమ పెన్షన్ కోసం తప్పకుండా పోరాటం చేయాలని లచ్చిరెడ్డి ఆధ్వర్యంలోని ఉద్యోగ జేఏసీకి మద్దతిచ్చి పాత పెన్షన్ సాధించుకోవాలని పిలుపునిచ్చింది..
సంఘ అధ్యక్షురాలు డాక్టర్ జి నిర్మల మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతృత్వం అదే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ కూడా పాత పెన్షన్ అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి గుర్తు చేశారు.. న్యాయమైన ఈ డిమాండ్ ను తప్పకుండా పరిశీలించి పరిష్కరిస్తారని ఆశాభవంతో ఉన్నట్టు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ జి నిర్మల పేర్కొన్నారు.


