వెల్లడించిన రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ఇందిరమ్మ ఇండ్లు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా బాచుపల్లిలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి ఇందిరమ్మ కమిటి సభ్యులుతో కలసి ముగ్గుపోయించి భూమి పూజ చేసారు.. ఈ సందర్భంగా పాండురంగా రెడ్డి మాట్లాడుతూ సొంతిల్లు నిర్మించుకోవడం అనేది ఎలాంటి వారికైనా ఒక అపురూపమైన కల. మరి పేదలకు సొంతిల్లు నిర్మించుకోవడం అనేది జీవితంలో చాలా పెద్ద కల. పేదలకు, గూడు లేనివారికి సొంతింటి కలను నిజం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు బాచుపల్లి గ్రామానికి ఇప్పటివరకూ 35 ఇళ్ళు మంజూరు అయ్యావని, మంజూరు అయిన వాటికి ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది.. అందులో 30 ఇండ్లు వరకు నిర్మాణం మొదలు పెట్టడం జరిగిందని అన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రాకమునుపు ఎన్నికల్లో ప్రతి పేదవాడికి రెండు పడకల గది నిర్మించి ఇస్తామని చెప్పి గత పది సంవత్సరాలలో మండలంలో ఏ ఒక్కరికి మచ్చుకకైనా కెసిఅర్ చెప్పినట్లుగా ప్రభుత్వం ద్వారా రెండపడకల గది మంజూరు చేయలేదు, ఇవ్వలేదు అని అన్నారు.
కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు ప్రతి పేదవాడికి పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది అని పాండురంగా రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చేవులపల్లి కృష్ణ, ఉపాధ్యక్షుడు యాలాల రాఘవేందర్, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు మలగల విజయ్, సభ్యులు అనేగౌని నవీన్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పగడాల సుధాకర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కత్తుల శ్రీశైలం, మైనార్టీ సెల్ అధ్యక్షుడు జంగిర్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కటం దేవేందర్ గౌడ్, పగడాల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దెల శ్రీశైలం, గ్రామ పెద్దలు సిరిగిరి కిరణ్ కుమార్ చారి, కుమారి శ్రీనివాస్