పోక్సో కేసులో నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్టు నాగోల్ పోలీసులు వెల్లడించారు. మల్కాజిగిరి సిటీ కమిషనరేట్ పరిధిలోని నాగోల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఈ తీర్పు వెలువడింది. నాగోల్ లోని త్యాగరాయ నగర్ కాలనీకి చెందిన కమ్మరి సాయి కుమార్ (26) అనే వ్యక్తి మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు పూర్తి ఆధారాలను పరిశీలించి నిందితుడికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా రూ.10 వేల జరిమానా విధిస్తూ, బాధితురాలికి రూ. యాభై వేలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం న్యాయమూర్తి పద్మావతి తీర్పు వెల్లడించారు. పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
పోక్సో కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష
RELATED ARTICLES


