బడంగ్ పేట్, అల్మాల్స్ గూడాలో పలు డివిజన్లలో కార్యక్రమాలు..
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో బడంగ్ పేట్, అల్మాస్ గూడాకి చెందిన పలు డివిజన్లలో జరిగిన ప్రజాపాలన వార్డు సభలలో పాల్గొన్నారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి.. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షపాతి అని, అన్ని వర్గాల ప్రజలకి రేషన్ కార్డులతో పాటు గ్రామాలలో ఉన్న రైతులకి రైతు భరోసా అందజేయడం కోసం.. ఇండ్లు లేని నిరుపేదలకి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించే దిశగా ప్రజల సమక్షంలోనే వాటి యొక్క అర్హులని ప్రకటించడం చాలా అభినందనీయం అని అన్నారు.
ఈ సమావేశాలలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ పి.సరస్వతి, కార్పొరేటర్లు సుర్ణగంటి అర్జున్, పెద్దబావి శోభ ఆనంద్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, భీమిడి స్వప్న జంగారెడ్డి, ఏనుగు రాంరెడ్డి, గౌర రమాదేవి శ్రీనివాస్, నాయకులు గట్టు బాలక్రిష్ణ, నయన చారి, పెద్దబావి బాబు, బొల్లాపల్లి కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


