Home తెలంగాణ ప్రజావాణితో హైడ్రా మరిన్ని సేవలకు శ్రీకారం..

ప్రజావాణితో హైడ్రా మరిన్ని సేవలకు శ్రీకారం..

0
72
Prajavani program every Monday.. Direct invitation to complainants..
Prajavani program every Monday.. Direct invitation to complainants..

ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం..
ఫిర్యాదుదారుల‌కు నేరుగా ఆహ్వానం..

చెరువులు ప‌రిర‌క్ష‌ణ‌, పున‌రుద్ధ‌ర‌ణ‌, నాలాలు, ప్ర‌భుత్వ, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడ‌డంతో పాటు.. ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు ప్ర‌జ‌లకు అండ‌గా నిల‌బ‌డి స‌హాయ స‌హ‌కారాలు అందించేందుకు ఉద్దేశించిన హైడ్రా ఇప్పుడు ప్ర‌జ‌ల నుంచి నేరుగా ఫిర్యాదుల‌ను స్వీక‌రించ‌డానికి సిద్ధ‌మైంది.

ఇందుకు ప్ర‌తి సోమ‌వారాన్ని అంటే ప్ర‌భుత్వ సెల‌వులు మిన‌హాయించి కేటాయించింది. చెరువులు, ప్ర‌భుత్వ స్థ‌లాలు, నాలాలు, పార్కులు ఇలా ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు ప‌రిర‌క్ష‌ణ‌లో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేసే క్ర‌మంలో ప్ర‌తి సోమ‌వారం ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులతో పాటు స‌ల‌హాల‌ను కూడా స్వీక‌రించ‌డానికి ఈ కార్య‌క్ర‌మాన్ని ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల వ‌ర‌కు, తిరిగి 3.00 గంట‌ల నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కూ రాణిగంజ్‌లోని బుద్ధ‌భ‌వ‌న్‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహిస్తారు..

ఫిర్యాదుకు సంబంధించిన అన్ని ఆధార ప‌త్రాల‌తో పాటు, పూర్తి వివ‌రాలు తీసుకుని కార్యాయానికి రావాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు. ఇక ఏమైనా సందేహాలుంటే 040 – 29565758, 29560596 నంబ‌ర్ల‌లో సంప్రదించాలని ఆయన సూచించారు..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here