మంత్రి దామోదర రాజనర్సింహకు విజ్ఞప్తి చేసిన నర్సుల జేఏసీ..
సానుకూలంగా స్పందించిన మంత్రి.. త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ..
నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు గురించి నర్సుల జె.ఏ.సి. ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహాని కలిసి నర్సులకు ప్రతేకంగా నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసేందుకు మనవి చేశారు జేఏసీ సభ్యులు.. అందుకు గాను మంత్రి సానుకూలంగా స్పందించి అతి త్వరలో సపరేట్ నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.. ఈ సందర్బంగా తెలంగాణ లోని అందరి నర్సుల తరుపున, ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేశారు.. ప్రత్యేకంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు జేఏసీ ధన్యవాదాలు తెలియజేసింది..
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోషియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డా. నిర్మల జేఏసీ చైర్మన్ సుజాత రాథోడ్, టి.ఎన్.ఏ. వైస్ ప్రెసిడెంట్ బీ. శిరీష రాణి, లక్ష్మణ్ రుదావత్, కల్పనా దత్త, విజిత, టి.ఎన్.ఓ.ఏ. సభ్యులు లక్ష్మీదేవి, రామానాయుడు, రంజన్, పరమేశ్వరి, హరిత, ఏ.ఎన్.ఎం. ఏ.ఎన్.ఎం. అసోసియేషన్ ప్రెసిడెంట్ అనసూయ, రామలక్ష్మి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు..