Wednesday, February 11, 2026
Google search engine
Homeస్పెషల్ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..

ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..

గిన్నిస్ రికార్డ్ వైపు అడుగులు..
భవిష్యత్తులో ఏమి చెయ్యబోతున్నామో తెలియజెప్పే ప్రయత్నం..

అభివృద్ధి పథంలో హైదరాబాద్ తోపాటు తెలంగాణ అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతుంది. ఆ వేగం మరింత పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలను హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి ఆహ్వానించడానికి తెలంగాణ సర్కార్ నిర్వహించబోతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అందరి దృష్టిని ఆకర్శిస్తుంది.

తెలంగాణ వైపు ప్రపంచ చూపు అనే విధంగా ప్రపంచదృష్టిని ఆకర్షించే విధంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ ను నాగార్జునసాగర్,హైదరాబాద్ నుండి శ్రీశైలం మధ్య రానున్న కొత్త నగరంలో ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు చేస్తూ ” రండి… భాగస్వాములు కండి “…. అంటూ ఆహ్వానిస్తూ అక్షరాల సమాహారాన్ని ఆకాశంలో ఆవిష్కరించి 3 వేల డ్రోన్లతో గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పాలని చూస్తుంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ఏ నిర్ణయం తీసుకున్న అది సంచలనమే అని చెప్పాలి. అందులో భాగంగానే డిసెంబర్ 8,9 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయేలా నిర్వహిస్తుంది.

ఇప్పటివరకు ఏం చేసారో వివరించడంతోపాటు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో సదస్సులో క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజాపాలన ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో భవిష్యత్తులో రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడానికి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవడానికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన జరిగింది . తెలంగాణను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి విజన్‌తో పాటు దాన్ని అమలు చేసే వ్యూహంతో ముందుకు వెళ్తుంది.

రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే స్పష్టమైన పాలసీ ఉండాలి. ప్రపంచ స్థాయి పేరెన్నికగన్న దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తలు, ఐఎస్‌బీ, నీతి ఆయోగ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను భాగస్వామ్యం చేసి, ప్రతి అంశాన్ని లోతుగా క్షుణ్ణంగా విశ్లేషించి డాక్యుమెంట్‌లో భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి తెలంగాణను మూడు విభాగాలుగా విభజించి స్పష్టమైన ప్రణాళికలను రూపొందించారు. ముఖ్యంగా విజన్, స్ట్రాటజీ తోపాటు ప్యూర్, క్యూర్, రేర్.. ఈ మూడు రకాల వ్యవస్థలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి, తద్వారా తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చడానికి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొస్తున్నారు. ఒక్కో రీజియన్‌లో ప్రాంతాల వారిగా ఏం చేయబోతున్నామన్నది డాక్యుమెంట్‌లో చాలా స్పష్టంగా చెబుతున్నారు.

రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పం. దార్శనికతే మా భవిష్యత్తు ప్రణాళికలు. తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో ముందుకు వెళ్లడానికి దేశ ప్రధాని నరేంద్రమోదీ మరియు పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీతో పాటు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులందరినీ ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నారు .

తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలని భావిస్తుంది. వ్యూహాత్మకంగా ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ పెడుతున్న సర్కార్ భవిష్యత్ నగరాన్ని కూడా పెట్టుబడిదారులకు పరిచయం చేయాలని అనుకుంటుంది. తద్వారా హైదరాబాద్ నగర విస్తరణకున్న అవకాశాలను కండ్లకు కట్టాలన్న ఆలోచనతో ఉంది.

హైదరాబాద్ అనుకూలతలను గుర్తించి ఇతర నగరాలలో ఉన్న పెట్టుబడులు కూడా ఇక్కడికి తరలివస్తున్నాయి. హైదరాబాదును చాలామంది పెట్టుబడిదారులకు రవాణా సౌకర్యాలు, జీవన పరిస్థితులు, సామాజిక స్థితిగతులు, మానవ వనరులు ఇలా ఏ అంశం చూసుకున్నా హైదరాబాద్ ది బెస్ట్ నగరంగా అనుకుంటున్నారు.

హైదరాబాద్ విస్తరణపై దృష్టిపెట్టిన సర్కార్ ఫ్యూచర్ సిటీ రూపకల్పన చేస్తుంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తి అయితే దశాబ్దం తర్వాత హైదరాబాద్ అమెరికాలోని న్యూయార్క్ సిటీతో పోటీ పడుతుందన్న ఆశాభావం వ్యక్తం అవుతుంది. వ్యవసాయం, ఐటీ, విద్య, ఆరోగ్యం, మరియు మౌలిక సదుపాయాల రంగాలలో ప్రభుత్వం తీసుకురాబోయే లక్ష్యాలను ఈ సదస్సులో వివరించబోతుంది.

ఆర్థికవృద్ధి, అన్నిరంగాల ప్రగతి, సంక్షేమం, సాధికారత, ఇలా భవిష్యత్తు తెలంగాణకు రోడ్డు మ్యాప్ రూపొందించనుంది. హైదరాబాదులో ఇప్పటికే ఐటీ అగ్రగామిగా ఉంది స్టార్ట్ ప్ హాబ్ గా నగరం పెరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన, పరిశ్రమల స్థాపన తద్వారా అభివృద్ధి రేటు సాధించడం సంపద సృష్టించడాన్ని ఛాలెంజ్ గా తీసుకుంటుంది. ఈ విషయంలో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణకు అనుకూలతలు ఎక్కువ. కావలసినంత భూమి ఇన్ఫాస్ట్రక్చర్ ఇప్పటికే అభివృద్ధి అయింది. కావలసినంత మ్యాన్ పవర్ ఉంది. రేవంత్ సర్కార్ సరైన సమయంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుందని చెప్పుకోవాలి. వాస్తవానికి నేడు దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరంగా హైదరాబాద్ ని చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా ఐటీ, ఫార్మా ,రియల్ ఎస్టేట్, టూరిజం, హాస్పిటల్స్ మౌళిక వసతులు వుండటంతో కంపెనీలు, మెగా పెట్టుబడిదారులు మొత్తం ఈరోజు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి సినిమారంగం ముందుకు వస్తుంది. సిని హీరోలు ఇందులో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు.

హైదరాబాద్ కు మంచి వాతావరణంతో పాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పాలి. ఇప్పటికే ఐటీ ఫార్మా ఇతర రంగాలలో బహుళాజాతి సంస్థలు హైదరాబాదులో తమ కార్యకలాపాలు ఎప్పటినుండో నిర్వహిస్తున్నాయి. వీటితోపాటు తెలంగాణ సర్కార్ నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులను ఫెట్టడానికి సదస్సులో పాల్గొనడానికి దేశ విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఉత్సాహం చూపుతున్నారు. దాదాపు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని సర్కార్ భావిస్తుంది.

పాలనా విధానాలలో స్పష్టత, అభివృద్ధి ప్రణాళికలలో వేగం, భవిష్యత్తు విషయంలో ఆశావాహదృక్పథంతో తెలంగాణ పరుగులు తీస్తున్నదని చెప్పడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు పోతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సదస్సుకు దాదాపు మూడు వేల మంది హాజరవుతారు.ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది.

  • ముచ్చర్ల దినకర్,
    తెలంగాణ సాంస్కృతిక సలహా మండలి సభ్యులు
    ఫోన్ : 9440704535
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments