సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేసి త్వరలో లబ్ధిదారులకి అందజేయాలి
సూచించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్య హాస్పిటల్ లో సాధరణ డెలివరీల సంఖ్య పెంచాలని, హాస్పిటల్ కి వచ్చే రోగులకు కావలసిన సౌకర్యాలు కల్పించాలని, శానిటేషన్ సక్రమంగా ఉండాలని, వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, రోగులకు కావలసిన మందులు సిద్ధం చేసుకోవాలని, నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచాలని, డైట్ సరిగా అందించాలని కలెక్టర్ సూచించారు.. హుజుర్నగర్ ఎన్ ఎస్ పి క్యాంపు నుండి వచ్చిన 45 సంవత్సరాల ఆతుకూరి సతీష్ ను లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నందు వలన కలెక్టర్ అతనిని పరామర్శించి, డాక్టర్స్ ఎలా చూస్తున్నారని, ఆహారం సరిగ్గా ఇస్తున్నారా లేదా..? మంచిగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. ఆర్ఎంఓ సిబ్బంది కొరత ఉన్నదని కలెక్టర్ కి సూచించగా, సిబ్బంది కొరత మా దృష్టిలో ఉన్నదని దాని గురించి కమీషనర్ తో మాట్లాడతానని హామీ ఇచ్చారు..
మోడల్ హౌజింగ్ కాలనీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి :
హుజూర్ నగర్ రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న హౌజింగ్ కాలనీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ కాలనీలో పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేసి, త్వరలో లబ్ధిదారులకి అందజేయాలని సూచించారు. రోడ్లు, ఎలక్ట్రిసిటి, నీటి వసతి త్వరగా ఏర్పాటు చేయాలని.. అలాగే వర్షాకాలం కాబట్టి రోడ్లకి ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ నాగార్జున రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఆర్ ఏం ఓ డాక్టర్ రవికుమార్, గైనకాలజిస్ట్ డా.. సింధు, జనరల్ సర్జన్లు వెంకటాద్రి, సునీల్ కుమార్, డ్యూటీ డాక్టర్ సంతోష్, హౌజింగ్ డిఈ సిధార్థ, డిప్యూటీ ఈఈ జంగయ్య, ఏఈ సాయిరాం, వర్క్ ఇన్స్ పెక్టర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.