ఫెయింజల్ తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ పై కొనసాగుతుంది. శనివారం సాయంత్రం తుఫాన్ తీరం దాటింది.తుఫాన్ తీరం దాటినా రాష్ట్రంలో మంగళవారం కూడా పలుచోట్ల వర్షం కురిసింది.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వాగుల ప్రవాహం పెరిగింది. మద్దెలవంక వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దేవళంపేట – వెదురుకుప్పం ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
వాతావరణ శాఖ ఏపీకి మరో హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 9 నుంచి 16వ తేదీ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగింది. తమిళనాడును ఆనుకుని ఏర్పడే ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారితే దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పింది. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండడంతో మరియు ఐఎండీ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


