అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అధికంగా బరువు ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు నానా అవస్థలు పడుతుంటారు. ఇందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. బరువు ఎక్కువగా ఉన్నవారు రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవాలి. రోజుకు తగినన్ని గంటల పాటు నిద్ర కూడా అవసరమే. నీళ్లను కూడా తగిన మోతాదులో తాగాల్సి ఉంటుంది. ఇంకా అనేక జాగ్రత్తలను పాటించాలి. అయితే బరువు వేగంగా తగ్గాలని అనుకునేవారు రాత్రి పూట డిన్నర్ అనంతరం పలు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. దీంతో శరీర మెటబాలిజం పెరుగుతుంది. కొవ్వు వేగంగా కరుగుతుంది. అధిక బరువు త్వరగా తగ్గుతారు. ఇక ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మన శరీర మెటబాలిజం రాత్రి పూట తక్కువగా ఉంటుంది. కానీ రాత్రిపూట మెటబాలిజంను పెంచితే మనం నిద్రిస్తున్నా కూడా మన శరీరం క్యాలరీలను ఖర్చు చేస్తూనే ఉంటుంది. అందుకు గాను మనం రాత్రి పూట డిన్నర్ అనంతరం తేలికపాటి వాకింగ్ చేయాలి. కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. దీంతో శరీర మెటబాలిజం పెరుగుతుంది. మనం నిద్రిస్తున్నా కూడా మన శరీరం క్యాలరీలను కరిగిస్తూనే ఉంటుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గాలనుకునే ప్రక్రియ వేగవంతం అవుతుంది. కనుక రాత్రి తిన్న అనంతరం కచ్చితంగా వాకింగ్ చేయాలి. అలాగే రాత్రి పూట భోజనం అనంతరం హెర్బల్ టీలను సేవించాలి. ముఖ్యంగా పెప్పర్మింట్ టీ లేదా కమోమిల్ టీని తాగాలి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరిచి మెటబాలిజంను పెంచుతాయి. దీంతోపాటు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో మనం రాత్రి పూట అధికంగా ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడతాము. నిద్ర కూడా చక్కగా పడుతుంది. అధిక బరువు తగ్గుతారు. కనుక రాత్రి పూట ఈ హెర్బల్ టీలను సేవిస్తే మంచిది.
రాత్రి పూట భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి. దీంతో మనం తిన్న ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మన శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. అలాగే రాత్రి పూట శక్తి కోసం మన శరీరం ఎక్కువగా గ్లూకోజ్ మీద కాకుండా కొవ్వు మీద ఆధార పడుతుంది. దీంతో మనం నిద్రిస్తూ ఉన్నా సరే కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. అలాగే రాత్రి పూట భోజనంలో లేదా భోజనం చేసిన అనంతరం ఎలాంటి తీపి పదార్థాలను తినకూడదు. ఇది క్యాలరీలను పెంచుతాయి. బరువు అధికంగా పెరిగేలా చేస్తాయి. కనుక రాత్రి పూట తీపి పదార్థాలను తినడం మానేయాలి. దీంతో బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రాత్రిపూట నిద్రకు ముందు కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు శ్వాస పీల్చుకునే వ్యాయామాలు చేయాలి. శ్వాసపైనే ధ్యాస పెట్టాలి. ఈ వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో హ్యాప్పీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అలాగే రాత్రి పూట కంప్యూటర్లు, ఫోన్లను వాడకండి. టీవీలను చూడడం కూడా తగ్గించండి. ఇలా చేయడం వల్ల శరీరంపై పడే నెగెటివ్ ప్రభావం తగ్గుతుంది. ఇది కూడా బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఇలా రాత్రి పూట డిన్నర్ అనంతరం పలు జాగ్రత్తలను పాటించడం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.