Wednesday, February 11, 2026
Google search engine
Homeతెలంగాణబీ.ఆర్.ఎస్. వ్యాప్తి చేస్తున్న వదంతులు నమ్మవద్దు…

బీ.ఆర్.ఎస్. వ్యాప్తి చేస్తున్న వదంతులు నమ్మవద్దు…

రైతులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించకండి…
బిఅర్ఎస్ చేస్తున్న యూరియా కొరత అంటూ తప్పుడు ప్రచారం..
వందతులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కప్పాటి పాండురంగా రెడ్డి..

ప్రజా ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న సానుకూలతను, అభిమానాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షంలోని కొందరు నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని, రైతులు, ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మవద్దని, ప్రభుత్వం సరిపడా యూరియా అందిస్తుందని తెలియజేశారు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పటి పాండురంగా రెడ్డి.. రైతులకు కావలసినంతా కొరత లేకుండా ఎప్పటికప్పుడు కేంద్రం తో సంప్రదిస్తూ, కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తూ.. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రజా ప్రభుత్వం చూస్తుందని ఆయన వెల్లడించారు కొందరు యూరియా లేదని, రైతులు ఇబ్బంది పెడుతున్నారని, గంటల కొద్దీ లైన్లలలో నిలబడుతున్నారని ప్రచార మాద్యమాలలో, సోషల్ మిడియాలో విష ప్రచారం చేయడం.. పట్ల ఆయన మీడియా ద్వారా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు తెలిసింది గోరంత తెలియంది కొండంతలా వ్యవహారిస్తూ, అటు ప్రజలను, ఇటు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గం ఇంచార్జ్ సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేలా చూసుకోవాలని.. ఎప్పటి కప్పుడూ మాట్లాడుతున్నారని తెలిపారు. ఇలాంటి వదంతులు రైతులు నమ్మవద్దని కోరారు. రైతులకు తగినంత యూరియా ఉందన్నారు.. రైతులు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు తీసుకుని వెళ్లి తగినంత యూరియాను తెచ్చుకోవాలని పాండురంగా రెడ్డి తెలిపారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments