Monday, February 23, 2026
Google search engine
Homeతెలంగాణబీటీ రోడ్ల పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ కళ్లెం

బీటీ రోడ్ల పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ కళ్లెం

ఎల్బీనగర్:

హయత్ నగర్ బస్ డిపో వెళ్ళు మార్గంలో జాతీయ రహదారికి అనుగుణంగా ఉన్న సర్వీస్ రోడ్డు, అనుసంధాన కాలనీ లింక్ రోడ్లకు నిర్మిస్తున్న బీటీ రోడ్ల పనులను స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ, హయత్ నగర్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం అత్యంత అవసరమని తెలిపారు. జాతీయ రహదారి విస్తరణకు అనుగుణంగా సర్వీస్ రోడ్లు మరియు కాలనీ లింక్ రోడ్లు బలమైన బీటీ రోడ్లుగా నిర్మించబడటం వల్ల స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు.ప్రత్యేకంగా హయత్ నగర్ బస్ డిపో పరిసర ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మెరుగుపడితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు వ్యాపార కార్యకలాపాలు కూడా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. అలాగే ఇదే విధంగా అన్ని లింక్ రోడ్లను కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళికాబద్ధంగా బీటీ రోడ్లుగా నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పనులు నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ, ప్రజల అవసరాలే తమ ప్రాధాన్యత అని, ఎల్లప్పుడూ ప్రజలతో కలిసే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments