స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆటలు ఆగేనా..?
చెరువులు ఆక్రమించి ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్న ఎమ్మెల్యే అనుచరులు..
అక్కడి పరిస్థితిని సమీక్షించిన హైడ్రా కమిషనర్…
ఎల్బీనగర్ చెరువుల కబ్జాకు స్థానిక ఎమ్మెల్యే అండదండలు…
తీవ్రంగా ఆరోపించిన మల్‌రెడ్డి రాంరెడ్డి.
చెరువుల కబ్జాలపై హైడ్రా కమిషనర్ కు ఫిరాదు చేసిన రాం రెడ్డి…
చెరువులోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం..
మరోసారి ఎల్.బీ. నగర్ లోని చెరువులను సందర్శిస్తాను…
హామీ ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్..
చెరువుల కబ్జాల విషయంలో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది.. ఎత్తి పరిస్థితుల్లోనూ నగరంలోని చెరువుల పరిరక్షణే ధ్యేయంగా రంగనాథ్ సారధ్యంలో హైడ్రా ముందుకు సాగుతోంది.. కబ్జాదారులు ఎంతటి వారైనా సహించేది లేదని కమిషనర్ హెచ్చరిస్తున్నారు.. ఈ క్రమంలోనే ఆయనకు అందిన ఫిర్యాదుల దృష్ట్యా ఎల్.బీ. నగర్ నియోజక వర్గంలోని బైరామల్ గూడ చెరువును సందర్శించారు..
బైరామల్ గూడ చెరువు కబ్జాకు సంబంధించి రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి హైడ్రా కమీషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన హైడ్రా కమీషనర్ తన అధికార బృందంతో కలిసి చెరువును పరిశీలించి కబ్జా అయిన స్థలాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరలో ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. చెరువు పరిసరాల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను త్వరితగతిన తొలగించేందుకు చర్యలు చేపడతామని, ఇందుకు సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరొకసారి ఎల్బీనగర్ లో పర్యటించి అన్ని చెరువులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు.
బైరామల్ గూడ చెరువు కబ్జా గురించి గతంలో రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీగా, టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తీవ్రంగా స్పందించడం జరిగిందని మల్‌రెడ్డి రాంరెడ్డి తెలిపారు.
బైరామల్ గూడ చెరువును ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తన అనుచరులు కబ్జా చేయడం వల్లనే హస్తినాపుర డివిజన్ రెడ్డి కాలనీ తో పాటు 150 కాలనీల నుండి వచ్చే వరద నీరు వివిధ కాలనీలలోని ఇండ్లకు చేరుతుందని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అండదండలతో చాపల చెరువు, బైరామల్ గూడ చెరువులతో పాటు ఎల్బీనగర్ లోని ఇంకా కొన్ని చెరువులు కబ్జా చేసి, ప్లాట్లు చేసి అమ్ముకున్నారని మల్‌రెడ్డి రాంరెడ్డి ఆరోపించారు.
ఎల్బీనగర్ లోని చెరువులను పరిరక్షించడానికి అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టి, పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.


