ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఫలహారం బండి ఊరేగింపు..
గల్లి గల్లి లో బోనాల పండుగ వాతావరణం..
భారీ సంఖ్యలో కళారూపాలు.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
బోనం సమర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కుటుంబ సభ్యులు..
అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి..
ఆశాభావం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్‌చెరు లో ఆషాడమాసం బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని ప్రతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటికీటలాడింది. పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని మహంకాళి అమ్మవారి దేవాలయం నుండి భారీ ఫలహార బండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది కళాకారులు, పోతురాజులు, శివ సత్తుల పూనకాలతో ప్రజలందరూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ కొద్దిసేపు నృత్యం చేసి అందరిని ఉత్సాహపరిచారు. ఆషాడ మాస బోనాల పండుగ సందర్భంగా పటాన్‌చెరు పట్టణంలోని వివిధ కాలనీలో గల అమ్మవారి దేవాలయాలను ఎమ్మెల్యే దర్శించుకున్నారు.
బోనాల పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే సతీమణి యాదమ్మ, వారి కుటుంబ సభ్యులు ఏడుగుల్ల పోచమ్మ దేవాలయంలో బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, గుమ్మడిదల మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, సిఐ వినాయక్ రెడ్డి, గూడెం విక్రమ్ రెడ్డి, గూడెం సంతోష్ రెడ్డి, గూడెం సందీప్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, జిఎంఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.
