Saturday, September 26, 2026
Google search engine
Homeతెలంగాణభాగ్యనగరంలో మహారాష్ట్ర వైభవ చాటిన గణేష్ ఉత్సవాలు!

భాగ్యనగరంలో మహారాష్ట్ర వైభవ చాటిన గణేష్ ఉత్సవాలు!

  • తెలంగాణ గడ్డపై అపూర్వ రీతిలో మహారాష్ట్ర అధికారిక రాష్ట్ర పండుగ ప్రదర్శన
  • డాక్టర్ సి.హెచ్. భద్ర సారథ్యంలో అంబరాన్ని అంటిన సంస్కృతి, సంప్రదాయాల ఉట్టిపడే వేడుకలు

హైదరాబాద్:
భాగ్యనగరంలో మహారాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా అత్యంత వైభవంగా నిర్వహించిన గణపతి మహోత్సవ రాష్ట్ర పండుగ కార్యక్రమం అద్భుత విజయం సాధించింది. మహారాష్ట్ర సాంస్కృతిక శాఖా మంత్రి అడ్వకేట్ ఆశిష్ షెలార్ సుదూర దార్శనికతకు, మరాఠా సాంస్కృతిక వైభవానికి ఈ చారిత్రక వేదిక నిలువునా సాక్ష్యంగా నిలిచింది.

మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రతినిధి, తెలుగు యునైటెడ్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, అంతర్జాతీయ భాషా ఉద్యమ మరియు పర్యావరణ తత్వవేత్త అశోక్ కంటె కృషితో ఈ మహోత్సవం తెలంగాణ గడ్డపై కనులపండువగా సాగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల రాజధానులలో మరాఠా సంస్కృతిని చాటిచెప్పే క్రమంలో భాగంగా, హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ వేడుకలు రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వారసత్వాన్ని మరింత ఇనుమడింపజేశాయి.

*శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షుల దివ్య దీవెనలు – బాలగంగాధర్ తిలక్ ఆశయ సాధన
ఈ చారిత్రక వేడుకలకు విచ్చేసిన పూజ్యనీయులు శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షుల వారు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. చదువు, క్రమశిక్షణ, జ్ఞాన సముపార్జనలో వినాయకుని స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని ఆశీర్వదించారు.
కలయిక ఫౌండేషన్ అధ్యక్షులు చేరాల నారాయణ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలను ఏకం చేసేందుకు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ పూణేలో ప్రారంభించిన గణేష్ ఉత్సవాలు నేడు దేశవిదేశాలకు విస్తరించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కొనియాడారు.

*డాక్టర్ సి.హెచ్. భద్ర సమర్థవంతమైన సారథ్యం – పర్యావరణ, సాంస్కృతిక పరిరక్షణ
తెలంగాణ గడ్డపై ఈ మహా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించిన ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ సి.హెచ్. భద్ర ఈ వేడుకలకు ప్రధాన భూమిక పోషించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులతో పాటు సాంస్కృతిక శాఖా మంత్రి అడ్వకేట్ ఆశిష్ షెలార్‌కు, ఈ కార్యక్రమానికి మూలకారకులైన అశోక్ కంటెకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ సి.హెచ్. భద్ర మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఈ సాంస్కృతిక మహోత్సవాన్ని ప్రపంచ దేశాలన్నింటికీ విస్తరింపజేస్తామని ప్రకటించారు. మహారాష్ట్ర గొప్పతనాన్ని, భాషా సంస్కృతిని, అమూల్యమైన వారసత్వ సంపదను ప్రపంచ మానవాళికి చాటిచెప్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి భావితరాలకు ఆదర్శప్రాయమని ఆయన ఉద్ఘాటించారు.

*కనులవిందుగా సాంస్కృతిక ప్రదర్శనలు – ఘనంగా హాజరైన ప్రముఖులు
కార్యక్రమంలో మరాఠీ రాష్ట్ర గీతాలాపనతో పాటు ‘జై జై మహారాష్ట్ర’ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. వినాయకుని జీవిత చరిత్ర ఇతివృత్తంగా ప్రదర్శించిన 14 రకాల అద్భుత జానపద కళారూపాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

ఈ మహా ప్రదర్శనలో ఆలిండియా ఓబీసీ ఆర్మీ జాతీయ అధ్యక్షులు లీడర్ కళ్యాణ నేత, వజ్ర ఈవెంట్స్ అధినేత అరుణ్, ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రధాన కార్యదర్శి నిఖిల్ సాయి కోనేటి, కోశాధికారి రిజ్వాన్ అహ్మద్, స్కూల్ ప్రోగ్రాం జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ ఏ. జోష్ణ రావు, జాతీయ ఉపాధ్యక్షులు సంతోష్ నడిగొట్టి, ఉపేందర్ యాదవ్, జాతీయ కార్యదర్శి సాగర్ నేత, సహాయ కార్యదర్శి రాజేష్ గౌడ్ పాల్గొని విజయవంతం చేశారు.
అలాగే సాయిగిరి హైస్కూల్ ప్రిన్సిపాల్ జితేందర్, ఎస్.జి.బి. పాఠశాల కరస్పాండెంట్ ప్రణయ్, ఎం.ఎం.సి.సి. టాలెంట్ స్కూల్స్ చైర్మన్ తమ్మినేని సత్యనారాయణ, ప్రిన్సిపాల్ మాలతి, డి.సి.సి. ప్రధాన కార్యదర్శి మీసం లవకుమార్, ప్రపంచ పర్యావరణ సంస్థ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు భరత్ వర్మ, అజయ్ రెడ్డి రాజా తదితరులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ ఉత్సవాన్ని దిగ్విజయం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments