Home ట్రెండింగ్‌ భారీగా తగ్గిన బంగారం ధరలు..

భారీగా తగ్గిన బంగారం ధరలు..

0
87
People going to shops.. About Rs. 2,700 decrease.. After Diwali, gold and silver prices will come down.
People going to shops.. About Rs. 2,700 decrease.. After Diwali, gold and silver prices will come down.

షాపులకు ఎగబడుతున్న జనం..
దాదాపు రూ. 2,700 తగ్గుదల..
దీపావళి తరువాత బంగారం, వెండి రేట్లు తగ్గుముఖం..

బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు కనిపించడం మామూలే. అంతర్జాతీయ పరిణామాలు, డిమాండ్‌ని బట్టి గోల్డ్ రేట్లు మారుతూ ఉంటాయి. గత నెల ఆరంభం నుంచి చూస్తే ఇప్పటివరకు బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించింది. ఈ నెల రోజుల కాలంలో బంగారం ధరలు కుప్పకూలాయి. నవంబర్ 1వ తేదీన తులం బంగారం రేటు 73 వేల 850 ఉండగా.. ప్రస్తుతం ఆ రేటు 71 వేల 150కి చేరుకుంది. అంటే ఈ నెల రోజుల కాలంలో దాదాపు రూ. 2700 తగ్గిందన్నమాట. దీపావళి పండగ తర్వాత బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం చూస్తున్నాం. గత వారంలో ఈ రేట్లు భారీగా క్షీణించాయి. దీంతో పసిడి ప్రియులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫ్రెష్ కొనుగోళ్లకు వెళుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ గోల్డ్ తులానికి రూ. 77 వేల 650 రూపాయలకు లభిస్తోంది. 22 క్యారెట్ గోల్డ్ రేటు చూస్తే 71 వేల 150 రూపాయలకు దొరుకుతోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here