Thursday, October 1, 2026
Google search engine
Homeతెలంగాణమల్లికార్జున నగర్ లో మున్సిపల్ నోటీసులనూ లెక్కచేయని అక్రమ నిర్మాణం!

మల్లికార్జున నగర్ లో మున్సిపల్ నోటీసులనూ లెక్కచేయని అక్రమ నిర్మాణం!

  • 10 అడుగుల ప్లాటు స్థలం కబ్జా… ఫైర్ సేఫ్టీ, సెట్‌బ్యాక్ నిబంధనల ఉల్లంఘన
    ప్రశ్నిస్తే దౌర్జన్యం, బెదిరింపులు… అధికారుల చర్యలకు బాధితుడి విజ్ఞప్తి.
  • ఈ వనస్థలిపురం డివిజన్లో పదుల సంఖ్యలో భారీ అక్రమ నిర్మాణాలు చోద్యం చూస్తున్న అధికారులు..
  • ఏం. ఎం.సి ఎల్బీనగర్ జోన్ ఎల్బీనగర్ సర్కిల్ 13 డిప్యూటీ కమిషనర్ దృష్టి సారించాలంటూ గగ్గోలు పెడుతున్న స్థానిక జనం..!

సరూర్‌నగర్:

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏం .ఎం.సి. పరిధిలోని ఎల్బీనగర్ జోన్, సరూర్‌‌నగర్ మండలం బైరామల్‌గూడ గ్రామం మల్లికార్జున నగర్‌లో అక్రమ నిర్మాణాలు హద్దులు దాటుతున్నాయి. మున్సిపల్ నిబంధనలను పూర్తిగా తిరోధరోధకం చేస్తూ, పొరుగు ప్లాటు స్థలాన్ని కబ్జా చేస్తూ చేపడుతున్న ఒక బహుళ అంతస్తుల నిర్మాణం స్థానికంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది.

ఫైర్ సేఫ్టీ, సెట్‌బ్యాక్ నిబంధనల ఉల్లంఘన:
మల్లికార్జున నగర్‌లోని సర్వే నంబర్లు 25, 26, 27/1 లో ఉన్న ప్లాట్ నంబర్ 25 పార్ట్‌ స్థలంలో భవన యజమాని/బిల్డర్ అనుమతి లేని బహుళ అంతస్తుల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణంలో మున్సిపల్ చట్టాల ప్రకారం తప్పనిసరిగా వదలాల్సిన ముందూ, వెనుక, పక్కల ఖాళీ స్థలాన్ని (సెట్‌బ్యాక్) వదలకుండా నిబంధనలను ఉల్లంఘించారు. అంతేకాకుండా, కనీస అగ్నిమాపక భద్రతా నిబంధనలు కూడా పాటించకపోవడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది.

10 అడుగుల స్థలం కబ్జా – ప్రశ్నిస్తే బెదిరింపులు:
ఈ అక్రమ నిర్మాణంలో భాగంగా పక్కనే ఉన్న ప్లాట్ నంబర్ 24 (ఇంటి నంబర్: 7-3-45/1) యజమాని వై. రాజేశ్వర్ రావుకు చెందిన దాదాపు 10 అడుగుల ప్లాటు స్థలాన్ని అనాధికారికంగా ఆక్రమించి నిర్మాణం జరిపారు. తన సొంత స్థలం కబ్జాకు గురికావడంపై బాధితుడు రాజేశ్వర్ రావు నిలదీయగా, సదరు నిర్మాణదారులు దౌర్జన్యానికి దిగుతూ బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. భవనం సరిహద్దులకు ఆనుకుని ఉండటం వల్ల వెలుతురు, గాలి నిలిచిపోవడమే కాకుండా, ఎగ్జాస్ట్ ఫ్యాన్ల నుంచి వచ్చే వేడి గాలి, సీపేజ్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు.

నోటీసులు ఇచ్చినా ఆగని పనులు:
ఈ అక్రమ నిర్మాణంపై బాధితుడు ఎల్బీనగర్ సర్కిల్ 13 డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, జోనల్ కమిషనర్ మరియు ఇతర ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, నిబంధనల ఉల్లంఘనను గుర్తించి సదరు నిర్మాణదారునికి మున్సిపల్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ, మున్సిపల్ అధికారుల నోటీసులను సదరు బిల్డర్ తృణప్రాయంగా భావిస్తూ అక్రమ నిర్మాణ పనులను ముమ్మరంగా కొనసాగిస్తుండడం గమనార్హం.

కఠిన చర్యలకు విజ్ఞప్తి:
నోటీసులు జారీ చేసినా లెక్కచేయకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న సదరు అక్రమ నిర్మాణదారునిపై అధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని బాధితుడు మరియు స్థానికులు కోరుతున్నారు. చట్టపరమైన చర్యలు చేపట్టి తమ ఆస్తికి, ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను ప్రార్థిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments