Home నేషనల్ మళ్ళీ తెరమీదకు ఈవీఎం టాంపరింగ్ అంశం..

మళ్ళీ తెరమీదకు ఈవీఎం టాంపరింగ్ అంశం..

0
114
BJP has tampered EVMs.. Alleging opposition.. NCP who took up the protest program
BJP has tampered EVMs.. Alleging opposition.. NCP who took up the protest program

బీజేపీ ఈవీఎంలను టాంపరింగ్ చేసింది..
ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు..
నిరసన కార్యక్రమం చేపట్టిన ఎన్.సి.పీ.

దేశంలో ఎన్నికలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా ఈవీఎంల ట్యాంపరింగ్‌ అంశం తెరపైకి వస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసి అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు గెలిచిన చోట ఈవీఎంల ఊసెత్తడం లేదని, ఓడిన చోట మాత్రం ఈవీఎంలను తప్పుపడుతున్నాయని బీజేపీ విమర్శిస్తోంది.

ఈ నేపథ్యంలో శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. సోలాపూర్‌ జిల్లాలోని మర్కడ్‌వాడి గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో శరద్‌పవార్‌తోపాటు ఎన్సీపీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. శరద్‌పవార్‌ ముందు నుంచి కూడా ఈవీఎంలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ అంశాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నారు. అందులో భాగంగానే సోలాపూర్‌లో ఈవీఎంలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here