Home స్పోర్ట్స్ మ్యాచ్ ఫీజులో కోహ్లీ కి 20 శాతం కోత‌..

మ్యాచ్ ఫీజులో కోహ్లీ కి 20 శాతం కోత‌..

0
66
Punishment in the incident of hitting Konstas with his shoulder.
Punishment in the incident of hitting Konstas with his shoulder.

కొన్‌స్టాస్‌ను భుజంతో ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో శిక్ష..

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నాలుగవ టెస్టులో.. యువ బ్యాట‌ర్ సామ్ కొన్‌స్టాస్‌ను ..కోహ్లీ భుజంతో ఢీకొట్టాడు. క్రీజ్‌పై ఎదురెదురుగా న‌డుస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఆ ఘ‌ట‌న ప‌ట్ల ఐసీసీ చ‌ర్య‌లు తీసుకున్న‌ది. కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం జ‌రిమానా విధించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప‌ద‌వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పిచ్‌పై ఎదురెదురుగా వెళ్తున్న స‌మ‌యంలో.. కొన్‌స్టాస్ భుజాన్ని కోహ్లీ తాకాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ఒక‌ర్ని ఒక‌రు తిరిగి చూసుకున్నారు. కొన్ని మాట‌లు అనుకున్నారు. మ‌రో బ్యాట‌ర్ ఖ‌వాజా వ‌చ్చి ఆ గొడ‌వ‌ను కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు.

ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌తో చ‌ర్చించిన ఆన్‌ఫీల్డ్ అంపైర్లు.. కోహ్లీపై లెవ‌ల్ 1 అభియోగాన్ని న‌మోదు చేశారు. ఆ నేరం కింద అత‌నికి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. కోహ్లీకి ఒక మ్యాచ్ నిషేధం విధించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తొలుత కొంద‌రు మాజీ క్రికెట‌ర్లు అంచ‌నా వేశారు. లెవ‌ల్ 2 నేరం అయితే కోహ్లీ నాలుగు పాయింట్లు కోల్పోయేవాడు. దాని వ‌ల్ల అత‌ను ఓ టెస్టు మ్యాచ్‌ను దూరం అయ్యే అవ‌కాశాలు ఉండేవి. క్రికెట్‌లో ఎటువంటి భౌతిక‌ప‌ర‌మైన దాడి .. ఐసీసీ నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన‌ట్లు అవుతుంది.

కోహ్లీ భుజం తాకిన ఘ‌ట‌న‌పై కొన్‌స్టాస్ స్పందించాడు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత మాట్లాడుతూ.. అత‌నేమీ కావాల‌ని భుజాన్ని ఢీకొట్ట‌లేద‌న్నాడు. అక‌స్మాత్తుగా కోహ్లీ త‌న‌వైపు దూసుకొచ్చాడ‌ని, క్రికెట్‌లో ఇదంతా జ‌రుగుతుంద‌న్నాడు. ఇద్ద‌ర‌మూ భావోద్వేగానికి లోనైట్లు చెప్పాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో కొన్‌స్టాస్ 27 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. ఆ త‌ర్వాత ఓవ‌ర్‌లో అత‌ను బుమ్రా బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స‌ర్ కొట్టాడు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here