Thursday, July 30, 2026
Google search engine
Homeతెలంగాణ*యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం!

*యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం!

*ప్రతిపక్షాల నిరసనల హోరు మధ్యే మూజువాణి ఓటుతో గ్రీన్ సిగ్నల్

*పేపర్ లీకేజీలకు పాల్పడితే ఇకపై పదేళ్ల జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా

*న్యూఢిల్లీ:

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పరీక్షల పేపర్ లీకేజీలు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కీలక బిల్లుకు పార్లమెంటులో ముద్రపడింది. ప్రతిపక్షాల తీవ్ర ఆందోళనలు, నినాదాల హోరు మధ్యే ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెంట్ బిల్లు-2026’ లోక్‌సభలో ఆమోదం పొందింది. ఎలాంటి సవరణలకు అవకాశం ఇవ్వకుండా, మూజువాణి ఓటు ద్వారా ప్రభుత్వం ఈ బిల్లును నెగ్గించుకుంది.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, కేంద్రం వెనక్కి తగ్గకుండా బిల్లును ఆమోదంపెట్టింది. సోమవారం సభ ముందుకు వచ్చిన ఈ బిల్లుపై రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చ జరగగా, బుధవారం నాటి ఓటింగ్‌లో ఇది ఆమోదం పొందింది.

*కఠిన శిక్షలు.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
యువత భవిష్యత్తుతో చెలగాటమాడే అసాంఘిక శక్తులకు చుక్కెదురయ్యేలా కొత్త చట్టంలో కఠినతరమైన నిబంధనలను పొందుపరిచారు.
*భారీ జరిమానా, జైలు: పేపర్ లీకేజీలు లేదా పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే దోషులకు గరిష్టంగా పదేళ్ల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించనున్నారు.
*వేగవంతమైన న్యాయం: కేసుల విచారణను శీఘ్రగతిన పూర్తి చేయడానికి ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.
*గత ప్రగతి: రెండేళ్ల క్రితం ఈ చట్టం ప్రాథమిక రూపం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 52 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.

*సభలో తీవ్ర ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం

బిల్లు ఆమోద సమయంలో లోక్‌సభ తీవ్ర గందరగోళానికి గురైంది. విద్యార్థులపై కాల్పులు జరపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ఆదేశించారంటూ రాహుల్ గాంధీ చేసిన తీవ్ర ఆరోపణలు సభలో పెను దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జితేంద్ర సింగ్‌తో పాటు పలువురు అధికారిక ఎంపీలు తీవ్రంగా మండిపడ్డారు.
రాహుల్ గాంధీకి పార్లమెంటరీ వ్యవహారాలపై, ప్రభుత్వ కార్యకలాపాలపై కనీస అవగాహన లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విమర్శించారు. గందరగోళ పరిస్థితుల నడుమ బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్‌సభను సభాపతి గురువారానికి వాయిదా వేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments