Tuesday, November 10, 2026
Google search engine
Homeతెలంగాణరంగారెడ్డి కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష!

రంగారెడ్డి కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష!

  • తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..
  • చట్టం ముందు అందరూ సమానమే: ఐఏఎస్ అధికారైనా కోర్టు ధిక్కరణకు శిక్ష తప్పదు!

హైద్రాబాద్
తెలంగాణ గడ్డపై న్యాయస్థానం మరోసారీ తన దమ్ము ఏంటో నిరూపించింది. పేదోళ్ల గోస పట్టించుకోకుండా, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన పెద్దోళ్లకు గట్టి గుణపాఠం చెప్పింది. కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డికి తెలంగాణ హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. అయితే, కలెక్టర్‌ పై కోర్టుకు అప్పీలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది.

అసలేం జరిగింది?
రిజిస్ట్రేషన్‌ చట్టం కింద నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కొన్ని ప్లాట్లను తొలగించాలని కోరుతూ బాధితులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వినతిని పరిశీలించి అరవై రోజుల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని 2025 ఆగస్టు నెలలో కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. కానీ, కోర్టు పెట్టిన గడువు ముగిసినా కలెక్టర్‌ గద్దెపై నుంచి కదల్లేదు, బాధితుల గోస పట్టించుకోలేదు.

ఆలస్యంగా స్పందించి.. మరింత దొరికిపోయి!
నిర్ణీత గడువు దాటిపోయినా కలెక్టర్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితులు 2025 అక్టోబరు 15న కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాతే ఉరుకులు పరుగులు పెట్టిన అధికారులు, బాధితులకు నోటీసులు ఇచ్చి 2026 ఫిబ్రవరి 26న వారి వినతిని కొట్టేశారు. ఆ తర్వాత జులై 8న మరోసారి తిరస్కరణ ఉత్తర్వులు జారీ చేశారు.

కోర్టు ధిక్కరణ పిటిషన్‌ పడ్డకానీ కదలని యంత్రాంగం తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు గడువు ఇచ్చినా పట్టించుకోకుండా, కావాలనే ఆదేశాలను ఉల్లంఘించారని ధర్మాసనం స్పష్టం చేసింది. ఐఏఎస్‌ స్థాయి ఉన్నత పదవిలో ఉండి న్యాయస్థానం ఉత్తర్వులను తుంగలో తొక్కడాన్ని సహించేది లేదని తేల్చిచెప్పింది. బాధ్యత మరిచి వ్యవహరించే అధికారులకు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments