పి ఏ సి చెర్మన్, శేరిలింగంపల్లి ఎం ఎల్ ఏ అరేకపూడి గాంధీ.
శేరిలింగంపల్లి :చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారంలో జాతీయ రహదారి విస్తరణ లో భాగంగా తీసుకోవాల్సిన చర్యల పై ఆర్ & బి అధికారులు డి ఈ సందీప్ , సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి మరియు గ్రామ పెద్దలతో కలిసి ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితుల తో చర్చించిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలియచేసిన పి ఏ సి చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగాపి ఏ సి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ జాతీయ రహదారి (ఎన్ హెచ్ 65) విస్తరణ, మరియు ఫ్లై ఓవర్ నిర్మాణం వలన జాతీయ రహదారి విస్తరణ లో భాగంగా రోడ్డు పక్కన ఉన్న ఇండ్లు కోల్పోతున్న బాధితుల కు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఎవరు అధైర్య పడకూడదు అని,ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని, అందరికీ ఆమోదయోగ్యంగా నష్టపరిహారం వచ్చేలా చూస్తాననీ, ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని, అందరికీ టీడీఆర్ అందేలా చూస్తామని, అందరికీ ఆమోదయోగ్య విధంగా రోడ్డు విస్తరణ చేపట్టడం జరుగుతుందన్నారు.
నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా , ట్రాఫిక్ రహిత సమాజం కోసం, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జాతీయ రహదారి ని విస్తరించడం జరిగినది, ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని, ప్రతి ఒక్కరు సహకరించాలని,,రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ నిర్మాణం వలన ట్రాఫిక్ కష్టాలు తప్పునని, సమయం, ఇంధనం ఆదా అవునని ,ప్రజలకు సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, గంగారం గ్రామ పెద్దలు ,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


