Monday, June 23, 2025
Google search engine
Homeఇంటర్నేషనల్రామ్ చరణ్ అభిమానులకు పండుగే..

రామ్ చరణ్ అభిమానులకు పండుగే..

అమెరికా గడ్డపై గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
డాలస్ లోని కర్టిస్ కల్వెల్ సెంటర్ కు పోటెత్తిన చరణ్ ఫ్యాన్స్
అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకున్న తొలి భారతీయ చిత్రం గేమ్ చేంజర్

టాలీవుడ్ లో భారీ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇటీవలే వచ్చిన పుష్ప-2 చరిత్ర సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే గేమ్ చేంజర్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్, శంకర్ కలయికలో వస్తున్న గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. నిన్న (డిసెంబరు 21) ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక అమెరికాలోని డాలస్ నగరంలో కళ్లు చెదిరేలా జరిగింది.

సినిమా రిలీజ్ కు ముందే గేమ్ చేంజర్ ఈ ప్రీ రిలీజ్ వేడుక ద్వారా చరిత్ర సృష్టించింది. ఓ భారతీయ సినిమా అమెరికా గడ్డపై ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకోవడం గేమ్ చేంజర్ తోనే ప్రథమం. డాలస్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు అభిమానులు పోటెత్తారు. ఇక్కడి కర్టిస్ కల్వెల్ సెంటర్ క్రిక్కిరిసిపోయింది. పుష్ప-2 దర్శకుడు సుకుమార్ ఈ వేడుకకు హాజరుకావడం విశేషం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments