Home తెలంగాణ రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి..

రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి..

0
104
Amit Shah advises newly elected BJP MLCs..
Amit Shah advises newly elected BJP MLCs..

కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలకు సూచించిన అమిత్ షా..
కేంద్రహోం మంత్రిని కలిసిన ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి

ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ టీచర్స్, గ్రాడ్యుయేట్ స్థానాల నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నేతృత్వంలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిశారు. ఆయనకు శాలువా కప్పి బొకెను అందజేశారు. ఎమ్మెల్సీలుగా గెలిచిన వారిని అభినందించిన అమిత్ షా.. రాష్ట్రంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఉత్సాహంగా పనిచేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సూచించారు. అమిత్ షాను కలిసిన వారిలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, గోడం నగేశ్​, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు
కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, సీనియర్ నేతలు ఉన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here