Home తెలంగాణ రేవంత్ లాగా కాళ్ళువత్తే పని నేను చేయను..

రేవంత్ లాగా కాళ్ళువత్తే పని నేను చేయను..

0
67
KTR made harsh comments.. We never anchored Adani.. Students should be careful.
KTR made harsh comments.. We never anchored Adani.. Students should be careful.

తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..
మేమెప్పుడూ ఆదానీని ఎంకరేజ్ చేయలేదు..
విద్యార్థులు నిబ్బరంగా ఉండాలి..
ఏ అవసరం వున్నా తమని సంప్రదించాలని సూచన..

తాము అదానీని అసలు ఎంకరేజ్ చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. నీ లెక్క లుచ్చా పనులు చేసి.. ఆయన కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు తనది కాదని సీఎం రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు. ఫ్రస్ట్రేషన్‌లో తనను తిడుతున్నావ్ సరే తనకు ఏమీ ఫరక్ పడదన్నారు. ప్రశ్నిస్తే తాను సైకోనా అని ప్రశ్నించారు. కొండారెడ్డిపల్లిలో నీ కోసం పనిచేసిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమయ్యావ్. మరి నువ్వు శాడిస్ట్ వా అని నిలదీశారు. నువ్వు తప్పు చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న శాడిస్ట్ ముఖ్యమంత్రివని ఫైరయ్యారు. ఏం చేస్తావో చేసుకో, తాము నీకు భయపడేవాళ్ల కాదన్నారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘మృత్యువుతో పోరాడి చనిపోయిన శైలజకు సంతాపం. గురుకులాల్లో చనిపోయిన 48 మంది విద్యార్థుల మృతికి సంతాపం. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే. గురుకులాల్లో పరిస్థితులపై రేవంత్‌ ఇప్పటివరకు సమీక్ష జరపలేదు. ఆందోళనలో ఉన్న లక్షలాది మంది గురుకుల విద్యార్థుల కుటుంబాల తరపున రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం, చీల్చి చెండాడుతాం. విద్యార్థులు నిబ్బరంగా ఉండాలి. ఎవరికి అవసరమైనా బీఆర్‌ఎస్‌ను సంప్రదించండి. విద్యార్థులను బీఆర్‌ఎస్‌ కాపాడుతుంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here