Home తెలంగాణ రోడ్డు దుస్థిపై కె.ఎల్.ఆర్. కు వినతిపత్రం..

రోడ్డు దుస్థిపై కె.ఎల్.ఆర్. కు వినతిపత్రం..

0
113
The main road leading from Almas Guda to Gurram Guda has become adwanan.
The main road leading from Almas Guda to Gurram Guda has become adwanan.

అద్వానంగా మారిన అల్మాస్ గూడ నుండి గుర్రం గూడ వెళ్లే మేన్ రోడ్..
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో జనాలకు ఇబ్బందులు..
సానుకూలంగా స్పందించిన కె.ఎల్.ఆర్..

బడంగ్ పేట్ మున్సిపల్ పరిధిలోని, అల్మాస్ గూడ శివాలయం (26 డివిజన్ ) నుండి శ్రీ శ్రీ హోమ్స్, న్యూ తిరుమల నగర్, హనుమాన్ నగర్, ఎం.ఆర్.ఆర్. కాలనీ, శ్రీ సాయి హోమ్స్, (24 డివిజన్) వెంకటేశ్వర కాలనీ, ఏ.ఆర్.సి.ఆర్. కాలనీ, విశాఖ నగర్, జయశంకర్ కాలనీ, వై ఎస్ ఆర్ నగర్ వరకు ఉన్న మెయిన్ రోడ్ మెట్రో వాటర్ వర్క్స్ వారు పైప్ లైన్ కోసం రోడ్ తవ్వేసి.. దాదాపు రెండు సంవత్సరాలు దాటి పోయినా ఇంకా సంబంధిత కాంట్రాక్టర్ రోడ్ వేయకుండా వదిలేయటంతో రోడ్డంతా గుంతలమయం అయి వాహన దారులు ,అటు ఇటుగా వెళ్లే వివిధ కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రధానంగా ఈ రోడ్ అల్మాస్ గూడ, గుర్రం గూడ గ్రామాలకి లింక్ రోడ్.. ఈ రోడ్ మీదుగా రోజూ కొన్ని వేల వాహనదారుల రాకపోకలు సాగిస్తుంటారు.. కాబట్టి అస్తవ్యస్తంగా మారిన రోడ్ ని బాగు చేయించాలని మహేశ్వరం ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డిని ఈ రోజు తుక్కుగూడ పార్టీ కార్యాలయంలో కలవటం జరిగిందని మల్రెడ్డి రామ్ రెడ్డి నగర్ కాలనీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నవారు మల్లారెడ్డి తెలియజేశారు.. కాగా ఈ విషయంపై బోయినపల్లి గోవర్ధన్ రెడ్డి, స్థానిక కాలనీవాసులతో కలిసి ఈ రహదారి సమస్యని
కే ఎల్ ఆర్ దృష్టికి తీసుకెళ్లి అద్వానంగా మారిన ఈ రోడ్ ని వేయించాలని ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది . ఇందుకు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత స్పెషల్ ఆఫిసర్, మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి.. రోడ్ బాగు చేయిస్తానని కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది.. .

ఈ కార్యక్రమంలో
నవారు మల్లారెడ్డి ,బోయపల్లి గోవర్ధన్ రెడ్డి ,శ్రీ హిల్స్ అధ్యక్షుడు N వెంకటేష్ గౌడ్ ,శ్రీ శ్రీ హోమ్స్ ప్రధాన కార్యదర్శి
P లక్ష్మి నరసింహ్మారెడ్డి ,కాంగ్రెస్ పార్టీ నాయకులు D శ్రీను గౌడ్ ,శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here